తూర్పుగోదావరి

మన్యంలో అక్షయ కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, ఏప్రిల్ 29: అక్షయ తృతీయ సందడి మన్యంకు కూడ పాకింది. రాజవొమ్మంగిలో బంగారు నగల దుకాణాలు శనివారం కొనుగోలుదారులతో కళ కళలాడింది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేసి లక్ష్మీదేవి వద్ద ఉంచితే ఆ ఇంటి సంపదతో తులతూగుతుందనే ప్రగాఢ నమ్మకంతో మహిళలు బంగారం షాపు వద్ద క్యూ కట్టారు. వారి స్తోమతకు తగ్గట్టు గ్రాము నుండి పది గ్రాముల వరకు కొనుగోళ్లు జరిగాయి. జీడిమామిడి గింజలు విక్రయించిన సొమ్ములు చేతికి అందడంతో గిరిజన కుటుంబాలు కూడ బంగారం కొనుగోలుకి మొగ్గుచూపారు. గ్రాము మేలిమి బంగారం రూ.2950 పలికింది. అనుకున్న దానికంటే ఎక్కువగా కొనుగోలు జరిగాయని స్థానిక బంగారం వర్తకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
విస్తృతంగా పోలీసు తనిఖీలు
రాజవొమ్మంగి, ఏప్రిల్ 29: చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల మారణహోమంతో మన్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సంఘటన అనంతరం అక్కడ సిఆర్‌పిఎఫ్ బలగాలు మావోయిస్టుల ఆచూకీ కోసం జల్లెడ పడుతుండగా, ప్రశాంతమైన వాతావరణం నెలకొన్న ఆంధ్రప్రదేశ్‌కు మావోయిస్టులు వచ్చి తలదాచుకోవచ్చనే అనుమానంతో తనిఖీలు ముమ్మరం చేశారు. మండలంలో జడ్డంగి, రాజవొమ్మంగి పోలీస్టేషన్ల ఎదుట శనివారం పోలీసులు విస్తుృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. అన్ని వాహనాలను నిశితంగా తనిఖీ చేసి అనుమానితులను ప్రశ్నించి వదులుతున్నారు. ఆర్టీసీ బస్సులు సైతం తనిఖీ చేసి ప్రయాణీకుల లగేజీలను పరిశీలించారు. విశాఖ జిల్లా అటవీ ప్రాంతం నుండి గంజాయి రవాణాకు కూడ అడ్డుకట్టవేయడానికి తనిఖీలు చేపడుతున్నామని ఎస్సై రవికుమార్ తెలిపారు. కాగా ప్రత్యేక పోలీసు బలగాలు పెద్దఎత్తున కూంబింగ్ చేపట్టాయి. మావోయిస్టులు విశాఖ జిల్లానుండి తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలియ వచ్చింది.
ఆనందోత్సహాలతో హజరాత్ ఇమామ్ హుస్సేన్ జయంతోత్సవం
మామిడికుదురు, ఏప్రిల్ 29 : ముస్లీంల ఆరాధ్య దైవమైన హజరాత్ హుస్సేన్ జయంతోత్సవాన్ని శనివారం ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. మామిడికుదురులో హజరత్ ఇమామ్ హుస్సేన్ పంజా నందు జయంతోత్సవ నీలాద్ జరిగింది. అంజుమనే పర్వానయే హుస్సేన్ అనే భక్తబృందం ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఇస్రాం మతానికి, నమాజ్ ప్రార్ధనకు జీవం పోసిన త్యాగమూర్తిగా ఇమామ్ హుస్సేను అభివర్ణించారు. ఈ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని పంజాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పాల్గొని ఆనందోత్సాహాలను పంచుకున్నారు. ఇదేవిధంగా నగరం గ్రామంలో బీబీ పాతిమా పంజా నుందు కూడా నీలాద్ జరిగింది. పలువురు ఉర్దూకవులు తమ కవితల ద్వారా ఇమామ్ హుస్సేన్ ప్రాతను వివరించారు.