తూర్పుగోదావరి

ముస్లింల సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జూన్ 19: ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తుందని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సోమవారం స్థానిక పెన్షన్ లైన్‌లో నూరాని జామియా మసీదు వద్ద రంజాన్ తోఫా సరుకుల కిట్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి చినరాజప్ప, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఆర్డీవో ఎల్ రఘుబాబు అధ్యక్షత వహించారు. మంత్రి రాజప్ప మాట్లాడుతూ రంజాన్ పురస్కరించుకుని తెల్లకార్డుదారులైన పేద ముస్లింలలో ఆనందం నింపాలన్న ఉద్దేశంతో రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర హజ్ హౌస్‌ను విజయవాడ, కడపల్లోనూ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. సభలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా హిందీలో మాట్లాడి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. రంజాన్ మాసం పవిత్రతను, ముస్లింలు నిర్వహించే విధానం కూడా కలెక్టర్ సభలో వివరించారు. ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ మంత్రి రాజప్ప, కలెక్టర్ కార్తికేయ మిశ్రా తదితరులు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మన్యం పద్మావతి, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ (చిన్ని), టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, ముస్లిం సంఘాల నాయకులు డి గౌస్, ఎస్‌కె జిలానీ, బహదూర్, అమీర్ బాషా, పట్టణ టిడిపి అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, భీమేశ్వరాలయం ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే జగదీష్‌మోహన్ (బాబు), టిడిపి వాణిజ్య విభాగం జిల్లా కార్యదర్శి గుమ్మళ్ళ రామకృష్ణ, వార్డు కౌన్సిలర్ పోలుపల్లి హైమావతి, తహసీల్దార్ ఎల్ శివకుమార్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
అయనవిల్లిలో కనువిందుచేస్తున్న ప్రకృతి సోయగాలు
అయినవిల్లి, జూన్ 19: చూసేకొద్దీ చూడాలనిపించే ప్రకృతి అందాలు కోనసీమలో అనేకం. మండల కేంద్రమైన అయినవిల్లి గ్రామంలో అడ్డాల రాంబాబు అనే రైతు పొలంలో గల చెరువులో గుర్రపు డెక్క పువ్వులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళే మార్గంలో ఈ గుర్రపుడెక్క పువ్వులు ఉండటంతో దూరపు ప్రాంతాల నుండి గుడికి వచ్చే భక్తులు వీటిని తిలకిస్తున్నారు.