తూర్పుగోదావరి

కాపులకు రెడ్ కార్పెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో కాపు, బలిజ కులాలకు అధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఆ సామాజికవర్గంలో తిరుగులేని పట్టు సాధించడానికి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాపులకు రెడ్ కార్పెట్ వేయడం ద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పట్టు నిలుపుకునే వ్యూహంతో ఆయన సాగుతున్నట్టు తెలుస్తోంది. కాపులను బిసిలుగా గుర్తించడమనే ప్రక్రియ రాజ్యాంగపరమైన అంశం కావడంతో ఆ విషయం ఎలాగున్నా, ఆ సామాజికవర్గాన్ని తన వైపు తిప్పుకునే ఎత్తుగడలో ముఖ్యమంత్రి ఉన్నట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తిరుగులేని రీతిలో కాపు సామాజికవర్గంలో పట్టు సాధించే ప్రయత్నాల్లో తమ అధినేత ఉన్నారని టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రభావం అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో గట్టిపట్టు సాధించడంతో పాటు సదరు సామాజికవర్గం యావత్తూ ముఖ్యమంత్రిపట్ల సానుభూతి చూపే రీతిలో అధినేత భవిష్యత్ నిర్ణయాలుంటాయని కూడా నేతలు పేర్కొంటున్నారు. 2019 ఎన్నికల నాటికి ఒకవేళ కాపులను బిసిల్లో చేర్చకపోయినా నష్టం వాటిల్లే అవకాశం లేకుండా అధినేత చర్యలుంటాయని వ్యాఖ్యానిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే కాపులకు పెద్దపీట వేయడానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే జనరల్ (మహిళ)కు కేటాయించిన కాకినాడ మేయర్ స్థానాన్ని ఎన్నికలకు ముందే కాపు మహిళకు ఇస్తామని ప్రకటించారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేత, కాపునేత చిక్కాల రామచంద్రరావుకు పట్టం కట్టారు. అలాగే జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ పదవిలో కోనసీమకు చెందిన కాపు నేత నామన రాంబాబును తొలగించినప్పటికీ అదే సామాజికవర్గానికి కాపునేత జ్యోతుల నవీన్‌ను నియమించారు. అయితే రాంబాబును తూర్పు గోదావరి జిల్లా టిడిపి అధ్యక్షుడిగా నియమించి మరో విధంగా న్యాయంచేశారు. ముఖ్యంగా జిల్లాలో కాపులకు పట్టున్న నియోజకవర్గాల్లో పట్టు సాధించడానికి ముఖ్యమంత్రి వివిధ మార్గాల్లో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావును పార్టీలో చేర్చుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వీరిరువురూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుండి గెలుపొందినప్పటికీ పార్టీ తీర్థం ఇచ్చారు. ఇదే సామాజికవర్గానికి చెందిన కాకినాడ ఎంపి తోట నరసింహంను లోక్‌సభలో టిడిపి పక్ష నేతగా నియమించారు. ఇక పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన కోనసీమ వాసి నిమ్మకాయల చినరాజప్పకు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన వెనువెంటనే ఉప ముఖ్యమంత్రిగా, హోంశాఖ మంత్రిగా చంద్రబాబు నియమించారు. విశేషం ఏమిటంటే మంత్రివర్గ విస్తరణలో భాగంగా చినరాజప్పను హోం మంత్రి పదవి నుండి తొలగిస్తారంటూ జరిగిన ప్రచారాన్ని పటాపంచలు చేశారు. ఆయనే్న హోంమంత్రిగా కొనసాగిస్తూ కాపు సామాజికవర్గ నేతల జోలికి వెళ్లనన్న సంకేతాన్ని ఆ సామాజికవర్గానికి చంద్రబాబు ఇచ్చారు. ఇటీవల జరిగిన కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధిక సంఖ్యలో కాపులకు కార్పొరేటర్ టిక్కెట్లు ఇవ్వడం చర్చనీయాంశమయ్యింది. కార్పొరేషన్‌లో టిడిపికి 35 మంది కార్పొరేటర్లు, బిజెపికి మరో ముగ్గురు మొత్తం 38 మంది కార్పొరేటర్లుండగా వీరిలో 18 మంది కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడం విశేషం.