తూర్పుగోదావరి

హోరాహోరీగా వాలీబాల్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లవరం, సెప్టెంబర్ 24: అల్లవరం మండలం కొమరగిరిపట్నం శ్రీన్యాపతి సుబ్బారావు జడ్పీ హైస్కూల్‌లో సబ్ జూనియర్ వాలీబాల్ చాంఫియన్ షిప్ 2017 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన పోటీల్లో పురుషుల విభాగంలో విశాఖ, అనంతపురం జిల్లా జట్లు తలపడగా విశాఖ జట్టు విజయం సాధించింది. పశ్చిమ గోదావరి, కడప జట్లుకు జరిగిన పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా జట్టు విజయం సాధించింది. విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలు జట్ల మధ్య జరిగిన మరో పోటీలో విశాఖ జటు విజయం సాధించింది. విజయనగరం - కర్నూలు మధ్య జరిగిన పోటీల్లో విజయనగరం జట్టు విజయం సాధించింది. శ్రీకాకుళం - తూర్పు గోదావరి జట్లు మధ్య జరిగిన పోటీల్లో శ్రీకాకుళం జట్టు విజయం సాధించింది. అలాగే బాలికల విభాగంలో కృష్ణాజిల్లా, శ్రీకాకుళం జట్లు తలపడగా కృష్ణా జట్టు విజేతగా నిలిచింది.
పొంగుతున్న వాగులు
అడ్డతీగల, సెప్టెంబర్ 24: ఏకబిగిన విడవకుండా ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి మండల పరిధిలోని పలు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మండల పరిధిలోని పైడిపుట్ట, పింజరికొండ, మట్లపాడు, బొంగరాలపాడు, రాజంపాలెం గ్రామాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. 59 కొత్తూరుపాడు గ్రామం వద్ద కొక్కిరిగడ్డ వాగు ప్రవహిస్తుండడంతో ఆగ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామాన్ని అనుసంధానిస్తూ నిర్మాణమైన కల్వర్టు నీటి ఉద్ధృతికి శిథిలమైంది. వాగుల అవతల వున్న పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రాణం తీసిన గొయ్యి
పిఠాపురం, సెప్టెంబర్ 24: పిఠాపురం సిఎంసి ఆసుపత్రి వెనుక ఉన్న అగ్రహారం రోడ్డులో ఆదివారం గోతిలో పడి వ్యక్తి ప్రాణాలు వదిలాడు. అగ్రహారానికి చెందిన ముగడ రమణ (47) ఆదివారం సైకిల్‌పై బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా గోతిలో పడిపోయాడు. దీంతో అతని తలకు అక్కడ రోడ్డుపై ఉన్న రాయి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు ఫోన్ చేయగా వైద్యసిబ్బంది వచ్చేలోపే అతడు ప్రాణాలు వదిలాడు. కాగా గోతుల వల్ల రాత్రి సమయాల్లో వాహనదారులు గాయాలపాలవుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
వైభవంగా మహా కుంభాభిషేకం
సామర్లకోట, సెప్టెంబర్ 24: సామర్లకోట నీలమ్మచెరువుగట్టు వద్ద వున్న శ్రీ సత్తెమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. తొలుత 111 మంది మహిళలు,కన్యలు కలశాలతో పట్టణ వీధుల్లో గరగలు, తీన్‌మార్ వంటి వాయిద్యాల ప్రదర్శనల నడుమ గోలివారి వీధి మీదుగా గాంధీబొమ్మ సెంటర్ నుండి రైల్వే గేటు ద్వారా గోదావరి కాల్వ బ్రహ్మణ రేవు వద్దకు చేరుకుని పవిత్ర గోదావరి జలాలను కలశాలతో సేకరించారు. అనంతరం బారీ ర్యాలీగా స్టేషన్ సెంటర్ మీదుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆలయం వద్ద అర్చకులు, పండితులు శాస్త్రోక్తంగా మహా కుంభాబిషేకం, ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు సమ్మంగి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయ దశమి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 30వ తేదీన శనివారం ఆలయం వద్ద భారీ అన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి చిట్టిమాని శ్రీనివాసరావు, కోశాధికారి చిట్టిమాని భద్రరావు, నాయకులు దారా శ్రీనువాసు, చిట్టిమాని కామరాజు, సమ్మంగి శ్రీను తదితరులు పాల్గొన్నారు.