తూర్పుగోదావరి

2018 నాటికి అన్ని గ్రామాలకు సిసి రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో 2018 నాటికి అన్ని గ్రామాలకు సిసి రోడ్లను వేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక ఇంద్రపాలెం సెంటర్లో ఆయన కాంస్య విగ్రహానికి రాజప్ప పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ భవన్‌లో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ జయంతిని ఐక్యరాజ్య సమితి నిర్వహించటం మనందరికీ గర్వకారణమన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, సమానత్వానికి, మహిళలకు అస్తి హక్కును కల్పించేందుకు ఆయన చేసిన కృషి మరువలేమన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. అన్ని పాఠశాలలను గురుకుల పాఠశాలలుగా మార్చేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోనున్నట్లు రాజప్ప తెలిపారు. ఎస్సీ విద్యార్ధులను విదేశాల్లో చదివేందుకు వీలుగా అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి పధకం కింద 10 లక్షల వంతున సహాయం అందిస్తున్నట్లు రాజప్ప చెప్పారు. అలాగే ఐఎఎస్, ఐపిఎస్ వంటి ఉన్నత పోటీ పరీక్షలకు అసరమైన శిక్షణ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు నామన రాంబాబు మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యనభ్యసించిన అంబేద్కర్‌ను ఈ దేశం మరువదన్నారు. ఆయన్ని ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ కులతత్వం రూపుమాపేందుకు విద్యే మార్గమని అందుకు అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని విద్యలో రాణించాలని కలెక్టర్ సూచించారు. ఉపాధి పధకంలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారే ఉంటున్నారని వారందరికీ వారు పనిచేసే చోట చదవటం, రాయటం వంటి కనీస విద్యను బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సభకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా సాంఘిక సంక్షేమ శాఖ డిడి ఎంఎస్ శోభారాణి స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని కేక్‌ను ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జెసి ఎస్ సత్యనారాయణ, జెసి-2 జె రాధాకృష్ణమూర్తి, ఎడిఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం పవన్‌కుమార్, ఎపిఎస్పీ కమాండెంట్ కోటేశ్వరరావు, దళిత నాయకులు ఎ రామేశ్వరరావు, కె నరసింహమూర్తి, పిట్టా వరప్రసాద్, బచ్చల కామేశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిఆర్‌డిఎ ద్వారా 120 సంఘాలకు 8 కోట్ల 12 లక్షలు, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు 50 వేలు ప్రోత్సాహకాలను, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 92 మంది లబ్దిరులకు కోటి 86 లక్షల విలువైన రుణాలు, మెప్మా ద్వారా 2 వేల 88 సంఘాలకు 85 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు.