తూర్పుగోదావరి

ముగిసిన బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయపురం, అక్టోబర్ 16: కోనసీమ తిరుపతిగా పేర్గాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం పూర్ణాహుతి, స్వామివారికి అభిషేకం, అనంతరం గౌతమీ గోదావరి నదిలో స్వామివారికి చక్ర స్నాన మహోత్సవాన్ని పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. చక్రస్నానం అనంతరం స్వామి, అమ్మవార్లను మంగళవాయిద్యాలు, బాణాసంచా, గోవింద నామ స్మరణల నడుమ స్వామివారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. సాయంత్రం పవళింపు సేవ, ఏకాంత సేవ, మహాశీర్వచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కరుటూరి నర్సింహారావు, దేవస్థాన ఇఒ ముదునూరి సత్యనారాయణరాజులు భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
రాజవొమ్మంగిలో శిశు మరణం
రాజవొమ్మంగి, అక్టోబర్ 16: ప్రభుత్వ ఆసుపత్రిలోనే పురుడు పోసుకోండి, క్షేమంగా ఉండండి అంటూ ప్రభుత్వ అధికారులు చేస్తున్న ప్రకటనల నడుమ నిరుపేదలు ఆశ్రయించే ప్రభుత్వ దవాఖానాలే మరణాలకు నిలయంగా మారుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే మండలంలో రెండు శిశుమరణాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుస్తోంది. రాజవొమ్మంగి గ్రామానికి చెందిన మిడతాడి మరియమ్మ ఆదివారం రాత్రి స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మగ శిశువుకు జన్మనిచ్చింది. జన్మించిన కొద్ది క్షణాలకే బిడ్డ మరణించింది. ఆసుపత్రికి పురిటి నొప్పులతో వచ్చిన మరియమ్మకు సకాలంలో కాన్పు పోయకపోడం వల్లే శిశువు మరణించిందని ఆమె కుటుంబీకులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎంపిడిఒ కెఆర్ విజయ ఆసుపత్రికి వచ్చి శిశువు మరణంపై ఆరాతీశారు. అనుభవజ్ఞులైన వైద్యులు లేకపోవడంవల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఏజెన్సీలో సీనియర్ వైద్యులను నియమించాలని స్థానికులు కోరుతున్నారు. కాగా అప్పలరాజుపేటకు చెందిన సేనాపతి వరలక్ష్మి కాకినాడ జనరల్ ఆసుపత్రిలో 5 రోజుల క్రితం పురుడుపోసుకుంది. ఆమెకు పుట్టిన బిడ్డ కొద్ది గంటల్లోనే మరణించాడు. ఏజెన్సీలో నివసిస్తున్న మహిళలకే ఎందుకు ఇలా జరుగుతుందనేది ఆలోచించాల్సిన విషయం. మహిళల్లో పౌష్టికాహార లోపం వల్లే బిడ్డలకు శాపంగా మారుతుందనేది స్పష్టమైన విషయం. ఏజెన్సీ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల కల్పనతో బాటు మహిళకు పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.