తూర్పుగోదావరి

ముద్రగడను పట్టించుకోవలసిన అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, అక్టోబర్ 16: కాపులకు బిసి రిజర్వేషన్‌పై ముద్రగడ పద్మనాభం ఇచ్చే అల్టిమేటంతో తమకు సంబంధం లేదని, అసలు ఆయనను పట్టించుకోవాల్సిన పనిలేదని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఘాటుగా స్పందించారు. సోమవారం పిఠాపురం మండలం వెల్దుర్తి, రాపర్తి, పిఠాపురం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ముద్రగడ రోజుకో ఉద్యమం చేస్తూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనేది ఆయన ఆలోచన అన్నారు. అటువంటి వ్యక్తిపై తామెందుకు స్పందించాలని, ఆయన అల్టిమేటాన్ని పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. కాపులకు మేలంటూ జరుగుతుందంటే అది ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. డిసెంబర్ నాటికి కాపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తవుతుందనే నమ్మకం ఉందని రాజప్ప స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ వేసామని, నివేదిక రాగానే రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. కాపు కార్పోరేషన్‌లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని, వాటిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందన్నారు. అనంతరం ఆయన పిఠాపురం నుంచి ప్రత్తిపాడు మండలం ధర్మావరానికి కలుపుతూ రూ.15 కోట్లతో నిర్మించే ఆర్‌అండ్‌బి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక మాల్లో పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల నాయకులు పాల్గొన్నారు.