తూర్పుగోదావరి

అర్జీల పరిష్కారంలో అలసత్వం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 23: ప్రజల నుండి వచ్చే సమస్యల పట్ల అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని, అర్జీలను పరిష్కరించడంలో ఏ విధమైన అలసత్వం మంచిది కాదని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ మల్లికార్జున అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీకోసం, ప్రజావాణి కార్యక్రమాలను సంయుక్త కలెక్టర్ మల్లికార్జున పర్యవేక్షించారు. ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలను పరిశీలించిన పిమ్మట వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. స్వయంగా పలు అర్జీలను పరిశీలించిన జెసి అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి మల్లికార్జున మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా ప్రజాసేవ చేయడంతో పాటు ప్రజల నుండి అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థపై ్ర నమ్మకాన్ని పెంచాలన్నారు. సుదూర ప్రాంతాల నుండి అధికారులకు విన్నవించుకునేందుకు వచ్చే అర్జీదారుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని పిలుపునిచ్చారు. కాగా ఈ వారం ప్రజావాణికి 357 అర్జీలు అందాయి. భూ సంబంధ సమస్యలు, సర్వే, పింఛన్లు, రేషన్ కార్డులు, వికలాంగుల సమస్యలు, ఇళ్ల పట్టాల మంజూరుకై అధికంగా దరఖాస్తులు అందాయి. అలాగే ఉద్యోగులు కావాలంటూ నిరుద్యోగులు, సహాయం కోసం వికలాంగులు అధికారులను ఆశ్రయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుండి రుణాలు మంజూరు చేయాలని కోరుతూ పలువురు అర్జీలు సమర్పించుకున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు ఫోన్ ద్వారా సమస్యలను తెలియజేశారు. ఆయా సమస్యలను జెసి రికార్డు చేసుకున్నారు. సంబంధిత తహసీల్దార్లకు సదరు సమస్యలను బదలాయించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డివిజనల్ రెవెన్యూ అధికారులు కూడా ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణం చొరవ తీసుకోవాలన్నారు. మండల, డివిజన్‌ల స్థాయిలో కూడా గ్రీవెన్స్‌ను పటిష్టంగా నిర్వహించి, ప్రజాసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జెసి సూచించారు. సంయుక్త కలెక్టర్-2 జె రాధాకృష్ణమూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం జితేంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఓంకార నాదంతో మార్మోగిన పంచారామ క్షేత్రం
సామర్లకోట, అక్టోబర్ 23: కార్తీకమాసంలో పరమశివునికి అత్యంత ప్రీతికరమైన తొలి సోమవారం సామర్లకోట పంచారామక్షేత్రం ఓంకార నాదంతో మార్మోగింది. సోమవారం పూజల్లో పాల్గొనేందుకు ఆదివారం అర్ధరాత్రి నుండి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు గోప్రదిక్షణం, అనంతరం గణపతి పూజ, స్వామివారి యోగ లింగానికి తరలివచ్చిన భక్త జన సందోహం నడుమ అర్చక స్వాములు పిఠాపురం మహారాజా గోత్ర నామాలతో అభిషేకం, అలంకారం, హరతి చేపట్టారు. అనంతరం బాలాత్రిపురసుందరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆర్టీసీ పంచారామ బస్సుల్లో యాత్రీకులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఆలయం వద్ద బయట రావిచెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించి, దీపదానాలు చేశారు. అలాగే మహాశివలింగానికి కోనేరులో ఉన్న జలాలను బిందెలతో తీసుకువచ్చి అభిషేకాలు నిర్వహించారు. టువంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకటరామారావు, సిఐ ఎస్ ప్రసన్న వీరయ్యగౌడ్, స్ధానిక ఎస్సై ఎల్ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు చేపట్టారు. రాత్రి 11 గంటల వరకూ దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏర్పాట్లను ఆలయ ఇవో పులి నారాయణమూర్తి, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే జగదీష్‌మోహన్ (బాబు), సభ్యులు, భక్త సంఘం నాయకులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం నంది మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఎమ్మెల్యే దంపతులను ఇవో, ఛైర్మన్ సత్కరించి ప్రసాదాలు అందచేశారు.
ద్రాక్షారామలో...
రామచంద్రపురం: కార్తీకమాస తొలి సోమవారం ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పెండ్యాల వెంకట చలపతి రావు భక్తులకు ఏర్పాట్లు చేశారు. రామచంద్రపురం డిఎస్పీ జయంతి వాసవీ సంతోష్ నేతృత్వంలో సిఐ కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్, ఎస్సైలు, ఇతర సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ వర్ధినీడి వెంకటేశ్వరరావు (నాని) నేతృత్వంలో సిబ్బంది ఈ-టిక్కెట్ల కౌంటర్లను నిర్వహించారు. సోమవారం ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. కార్తీకమాస సోమవార వ్రతాలను భక్తులు నిర్వహించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు వద్ద పూజలు చేశారు.
తొలిసారిగా ఈ-టిక్కెట్ కౌంటర్
భీమేశ్వరస్వామి ఆలయంలో ఈ-టిక్కెట్ కౌంటర్లను తొలి సోమవారం ప్రారంభించారు. ఇటీవల ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈ-టిక్కెట్ కౌంటర్‌ను ప్రారంభించిన విషయం పాఠకులకు విదితమే.