తూర్పుగోదావరి

ఆయల్ నిక్షేపాలపై పరిశోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినవిల్లి, డిసెంబర్ 13: గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆయిల్ నిక్షేపాలు ఏవిధంగా ఉన్నాయనే విషయమై ఆంధ్రా యూనివర్శిటీ డిఎస్‌ఐ (డెల్టా స్టడీస్ ఇన్‌స్టిట్యూట్) బృందం ముక్తేశ్వరం-కోటిపల్లి రేవులో పరిశోధనలు చేశారు. బుధవారం యానాం నుండి బోటులో ముక్తేశ్వరం-కోటిపల్లి రేవు వద్దకు ప్రొఫెసర్ కెఎస్‌ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో 16 మంది ఓఎన్జీసీ అధికారులు వచ్చి కోటిపల్లి రేవు ఇసుక దిబ్బలు వద్ద ఏర్పడిన మట్టితోకూడి ఉన్న నాచును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రెడ్డి మాట్లాడుతూ డెల్టా స్టడీస్ ఇనిస్టిట్యూట్‌కు ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఓఎన్జీసీ అధికారులను యూనివర్సిటీకి పంపిస్తారని, వారికి గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఆయిల్ నిక్షేపాలు ఏవిధంగా ఉంటాయో చూపిస్తామన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో గోదావరి డెల్టా ప్రాంతాల్లో వారం రోజులు తమ బృందం పర్యటించి వివరిస్తుందన్నారు. గోదావరి చెంతనే మట్టితో కూడిన నాచు రెండు కిలోమీటర్ల మేర భూగర్భంలో పొరలు పొరలుగా కప్పి ఉంటుందని, అధిక ఉష్ణోగ్రతకు ఆయిల్‌గా మారి తరువాత ఇసుకలో చేరుతుందన్నారు. అనంతరం ఓఎన్‌జిసి పరిశోధనలో అవి బయటపడి ఆ ప్రాంతంలో ఆయిల్ నిక్షేపాలున్నట్టు గుర్తిస్తామని ప్రొఫెసర్ రెడ్డి వివరించారు. ఈ బృందంలో భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఓఎన్జీసీ అధికారులుగా పనిచేస్తున్న వారు వచ్చారని, వారికి తీరప్రాంతాల్లో ఆయిల్ నిక్షేపాలు ఏ విధంగా బయట పడతాయనే దానిపై ఫీల్డ్‌వర్క్ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిఎస్‌ఐ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్లు టివై నాయుడు, ఇఎన్ ధనుంజయరావు, ఎఎస్‌ఆర్ స్వామి, డాక్టర్ టి కరుణాకర్, ఓఎన్జీసీ అధికారులు పాల్గొన్నారు.

వైద్యం కోసం రైలులో వెడుతూ...
సామర్లకోట, డిసెంబర్ 13: అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడికి మెరుగైన వైద్యం కోసం చెన్నైకు రైలులో తరలిస్తున్న తల్లిదండ్రులకు మార్గమధ్యంలోనే పుత్రశోకం కలిగింది. ఆరోగ్య పరిస్థతి విషమించడంతో సామర్లకోటలో రైలు నుండి దిగి, ఆసుపత్రికి తరలిస్తుండగానే తొమ్మిదేళ్ల బాలుడు కన్నుమూశాడు. మృతదేహంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థిలో ఉన్న పశ్చిమబంగ రాష్ట్రం హౌరాకు చెందిన తల్లిదండ్రులకు మానవ హక్కుల సంఘం నేతల చొరవతో పోలీసులు సాయపడి, అంబులెన్స్‌లో మృతదేహాన్ని సొంత ప్రాంతానికి తరలించే ఏర్పాటుచేశారు. సామర్లకోట రైల్వే స్టేషన్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన అందరినీ కలచివేసింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హౌరాకు చెందిన పదేళ్ల బాలుడు మయన్ నాయక్ గౌడ్‌కు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుండగా అతడిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం సామర్లకోట మీదుగా సూపర్ పాస్టు ఎక్స్‌ప్రెస్‌లో వెళుతున్నారు. ఈ రైలుకు సామర్లకోటలో హాల్టు లేదు. ఉదయం రైలు సామర్లకోట సమీపానికి వచ్చేసరికి బాలుడి ఆరోగ్యం విషమించడంతో తోటి ప్రయాణీకులు రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును సామర్లకోట ఆపుచేసి బాలుడిని, తల్లిదండ్రులను సామర్లకోటలో దింపారు. అనంతరం అక్కడి నుండి బాలుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆటోలో తరలిస్తుండగా, మార్గ మధ్యలోనే కన్నుమూశాడు. దాంతో తల్లిదండ్రులు ఏమిచేయాలో పాలుపోక తిరిగి సామర్లకోట రైల్వే స్టేషన్‌కు చేరుకుని అయోమయంగా పార్శిల్ కార్యాలయం వద్ద వేచివున్నారు. బాలుని మృతదేహాన్ని స్వస్థలానికి ఎలా తీసుకువెళ్లాలో తెలీయక తికమక పడుతుండగా, మానవహక్కుల సంఘం జిల్లా అద్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, సభ్యులు కుంచే నానిబాబు, జె అప్పారావులు స్థానిక పోలీసుల సహాయాన్ని కోరారు. తదుపరి పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్‌ను ఏర్పాటుచేసి వారికి దైర్యంచెప్పి మృతదేహాన్ని హౌరాకు పంపించే ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మానవహక్కుల సంఘం నాయకులు చొరవను వారు కొనియాడారు.

19 నుంచి ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, డిసెంబరు 13: జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని ఎన్టీఆర్ సాగర తీరంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. బీచ్ ఫెస్టివల్‌ను రాష్టస్థ్రాయి ఉత్సవంగా ఈనెల 19నుంచి 21వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మూడురోజుల పాటు జరిగే ఈ సాగర సంబరాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారు కావల్సి ఉంది. ఫెస్టివల్‌ను ప్రారంభించేందుకు లేక ముగింపు ఉత్సవానికి ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. సాగర సంబరాలపై జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, సంయుక్త కలెక్టర్ ఎ మల్లిఖార్జున ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రత్యేక శ్రద్ధతో బీచ్ ఫెస్టివల్‌లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్ సంగీత ప్రదర్శన ఏర్పాటుచేస్తున్నారు. రెహ్మాన్ షో ఫెస్టివల్‌కు ప్రథాన ఆకర్షణగా నిలవనుంది. ఫెస్టివల్ చివరిరోజైన 21వ తేదీన ఎఆర్ రహమాన్ ప్రదర్శన ఉంటుంది. ప్రతిభావంతులైన కళాకారులు రహమాన్‌తో కలసి వేదికపై సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. రహ్మాన్ సంగీత రంగంలో ప్రవేశించి 25 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో రజతోత్సవ వేడుకలకు కాకినాడ బీచ్ ఫెస్టివల్ వేదికగా నిలుస్తుండటం విశేషం! ఈ రాక్‌డ్రమ్స్ జాతీయ స్థాయి ప్రదర్శన ఎంపికలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన కళాకారుల నుండి ఇప్పటికే రెహ్మాన్ టీం వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. వారు ఎంపిక చేసిన కళాకారులే ఆరోజు వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ ఉత్సవాల్లో తన గాన మాధుర్యంలో ఓలలాడించనున్నారు. ప్రస్తుతం బీచ్ సుందరీకరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ పథకం కింద సుమారు 45కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బీచ్ అభివృద్ధిలో భాగంగా ల్యాండ్ స్కేపింగ్, షాపింగ్ కాంప్లెక్స్, కాన్ఫరెన్స్ హాలు, లేజర్ షో, వాటర్ ఫౌంటేన్ వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 2 కోట్ల వ్యయంతో బీచ్ పచ్చదనంతో నిండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల ఫెస్టివల్‌లో అనేక స్టాల్స్, ఫ్లవర్ షోలు, క్రీడలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు, ఫుడ్‌కోర్టులు, జిల్లాకు చెందిన ప్రసిద్ధి వంటాలను అందుబాటులో ఉంచుతారు. ఫెస్టివల్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపడుతున్నారు. కాకినాడ-ఉప్పాడ మార్గం ఇరుకైనది కావడంతో ఇక్కడ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఇక్కడి ఇరుకు వంతెన వద్ద తొక్కిసలాట, ఇతర ప్రమాదాలకు తావులేకుండా ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
చేనేతలకు చేయూత
పెద్దాపురం, డిసెంబర్ 13: రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, చేనేత, జౌళి శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. పట్టణంలో చేనేత బంధు ముప్పన రామారావు కుటుంబ సభ్యుల సహకారంతో రూ.50 లక్షలతో నిర్మించిన చేనేత సహకార భవనాన్ని బుధవారం హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా భవనంలో ముప్పన రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హోం మంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తరువాత అత్యంత ప్రాధాన్యతగల రంగం చేనేత, జౌళి రంగమేనన్నారు. అంతటి ప్రాధాన్యత గల రంగం నేడు అనేక ఒడిదుడుకులకు లోనవుతుందన్నారు. చేనేత కార్మికుల జీవనం మరింత దుర్భరంగా మారుతుందన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల చేనేత రంగం ఉనికికి ప్రమాదం ఏర్పడిందని, అటువంటి తరుణంలో రాష్ట్రంలో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత రంగానికి విశేష ప్రాధాన్యత కల్పించారన్నారు. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపి, చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలో చేనేత కార్మికుల రుణాలకుగాను రూ.75 కోట్లు మాఫి చేసినట్టు మంత్రి తెలిపారు. చేనేత కార్మికులకు యాభై ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పించిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 25వేల కొత్త పింఛన్లు మంజూరు చేశామన్నారు. చేనేత కార్మికులకు 20 శాతం యార్న్ సబ్సిడీ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సబ్సిడీని మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు. చేనేత కార్మికులు తయారుచేస్తున్న వస్త్రాలపై ఆప్కో ద్వారా సబ్సిడీ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత కార్మికుల కుటీర పరిశ్రమ నిర్వాహణకుగాను షెడ్లు వేసుకునేందుకు వీలుగా రూ. నాలుగు లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వం త్వరలో చీర, ధోవతి పథకాన్ని పునఃప్రారంభించే అవకాశం ఉందన్నారు. దీని ద్వారా పార్టీ వ్యవస్థాపక నేత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఆశయసాధనకు తిరిగి జీవం పోయనున్నట్టు ఆయన తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చేనేత శాఖ ద్వారా మోగా క్లస్టర్లను రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 చేనేత క్లస్టర్లను తయారు చేశామన్నారు. 150 క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు రావలసి ఉందన్నారు. జనవరి-1 నుండి చేనేత కార్మికుల కుటుంబాల్లో పిల్లలకు వివాహాలు చేసుకుంటే వారికి పెళ్లి ఖర్చుల కోసం రూ. 35 వేల బహుమతిగా అందించనున్నట్టు తెలిపారు. పట్టణంలో బీసీ కులాల విద్యార్థుల కోసం త్వరలో రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. హోం మంత్రి చినరాజప్ప చొరవతో నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలో కూడా ఇంతటి అభివృద్ధి జరగలేదంటే అతిశయోక్తి కాదన్నారు.
ఫార్మా, మార్కెటింగ్ రంగాల్లో భారీగా ఉద్యోగావకాశాలు

ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, డిసెంబర్ 13: ఫార్మా, మార్కెటింగ్ రంగాల్లో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను అందుకోవాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు సూచించారు. నన్నయ యూనివర్సిటీ కౌశల్ గోదావరి, వికాస ఆధ్వర్యంలో మూడురోజుల పాటు మెగా జాబ్ మేళాలో రెండో రోజు బుధవారం వివిధ విభాగాలకు సంబంధించి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో వీసీ ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మార్కెటింగ్ రంగానికి విపరీతిమైన డిమాండ్ ఉందన్నారు. అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈ రంగంలో ఉజ్వల భవిష్యత్ లభిస్తుందన్నారు. ఈ జాబ్ మేళాను ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ ఆసక్తితో ఉద్యోగాల్లో చేరి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. అనేక కంపెనీల్లో అవకాశాలు ఉన్నాయని, వాటిని సాధించే సామర్ధ్యం అభ్యర్ధులు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కౌశల్ గోదావరి, వికాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని వికాస డైరెక్టర్ వి ఎన్ రావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రధానంగా టెక్నికల్ రంగానికి సంబంధించిన 1700 ఉద్యోగాలకు 1535 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రెజిన్ పవర్ టెక్, బిఎ సిపిఎల్, హెమయ్ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎఫెక్ట్రీనిక్స్, మెన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి 15 ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తం 514 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించి నియామక పత్రాలు అందుకున్నారు.
రేపటి నుంచి జాతీయ సమావేశం
ఆదికవి నన్నయ యూనివర్సిటీలో 15, 16 తేదీల్లో విద్యా విభాగం ఆధ్వర్యంలో గుణాత్మక విద్య ద్వారా సమర్ధవంతమైన జీవనం అనే అంశంపై రెండు రోజుల జాతీయ సమావేశం నిర్వహించనున్నట్టు వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు చెప్పారు. ఈ సమావేశానికి సంబంధించి బుధవారం యూనివర్సిటీలో బ్రోచర్‌ను వీసీ ఆవిష్కరించారు. ఏపీలోని ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధనా విద్యార్హతలతోపాటు ఒడిస్సా, చండీఘర్, సిక్కిం, మేఘాలయ, తెలంగాణా, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది అభ్యర్థులు వచ్చి పరిశోధనా పత్రాలు సమర్పిస్తారని వీసీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో గుణాత్మక విద్య ద్వారా సమర్ధవంతమైన జీవనానికి అవసరమైన అంశాలను చర్చించి, వాటిపై నివేదికలు తయారు చేస్తారన్నారు. ఈ పరిశోధనా వ్యాసాలను నాలుగు గ్రంథాలుగా ముద్రించి ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ జాతీయ సమావేశాలను జయప్రదం చేయాలని కోరారు.
బూత్ స్థాయలో బీజేపీని బలోపేతం చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, డిసెంబర్ 13: పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రజా సమస్యలపై పోరాడుతూ శక్తిని ప్రదర్శించడమే బీజేపీ శక్తి కేంద్రాల లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రవీంద్రరాజు, కేంద్ర కమిటీ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌లోని పిడింగొయ్యి గ్రామ పరిధిలోగల గోల్డెన్ ఫంక్షన్ హాలులో బుధవారం బీజేపీ శక్తి కేంద్రాల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రవీంద్రరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరయ్యారు. రాజమహేంద్రవరం అసెంబ్లీ పరిధిలోని 242 బూత్‌ల నుంచి ముఖ్య శక్తి కేంద్ర సభ్యులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ నిత్యం ప్రజలకు బూత్ కమిటీ శక్తి కార్యకర్తలు అందుబాటులో ఉండాలని వారు పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ సదస్సుకు జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల వెంకట్రావు అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, జిల్లా ఇన్‌చార్జి తిరుపతిరావు, రూరల్ మండల అధ్యక్షుడు యానాపు ఏసు, ఏఎంసీ డైరెక్టర్ కరుటూరి శ్రీనివాస్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.
నలుగురు క్షేత్ర సహాయకుల తొలగింపునకు పీవో ఆదేశం
రంపచోడవరం, డిసెంబర్ 13: ఉపాధి హామీ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న నలుగురు క్షేత్రస్థాయి సహాయకులను విధుల నుండి తొలగించాలని ఉపాధి హామీ ఎపిడిని ఐటిడిఎ పివో దినేష్‌కుమార్ ఆదేశించారు. బుధవారం ఆయన ఐటిడిఎ సమావేశపు హాల్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పివో దినేష్‌కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీలో వేతన కూలీలందరికి పనులు కల్పించేందుకు సిబ్బంది పాటుపడాలన్నారు. 20 గ్రూపులకు ఒక్కొక్కరు చొప్పున జూనియర్ మేస్ర్తీని నియమించాలని ఆదేశించారు. బడదనాంపల్లి, నెల్లిపూడి, బూసిగూడెం, రంపచోడవరం ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయని, వారిని సక్రమంగా పనిచేసేలా చూడాలని ఎపివోను ఆదేశించారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాలు తమకు అప్పగించిన నిర్మాణ పనులు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తి చేయడం లేదని పివో దినేష్‌కుమార్ అసహనం వ్యక్తం చేశారు. అప్పగించిన అంగన్‌వాడీ సెంటర్ల నిర్మాణాలు, ఉపాధి హామీ అనుసంధాన రోడ్లు, సిసి రోడ్లు, నిర్మాణాల పురోగతిని, ప్రగతిని సమీక్షించారు. గిరిజన వారపు సంతల్లో క్రమం తప్పకుండా వైద్య శిబిరాలను నిర్వహిస్తూ మాతా, శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని డిఎంఅండ్‌హెచ్‌వో చెంచయ్యను ఆయన ఆదేశించారు. అలాగే ఒక వైద్యాధికారి పోస్టును కూడా నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఎంఅండ్‌హెచ్‌వో అప్పారావు, ఈఈ నాగేశ్వరరావు, డీఈలు జనార్దన్, వేణుగోపాల్, రాంప్రసాద్, ఎపిడి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పికెట్లు
రామచంద్రపురం, డిసెంబర్ 13: గత 21 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశమైన రామచంద్రపురం వెంకటాయపాలెం శిరోముండనం ఆరోపణల కేసుకు సంబంధించి విశాఖపట్నం కోర్టులో గురువారం తీర్పు వెలువడనున్న నేపధ్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటుచేశారు. రామచంద్రపురం డిఎస్పీ జయంతి వాసవీ సంతోష్ నేతృత్వంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్ సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇతర ప్రాంతాల నుండి పోలీస్ దళాలను రప్పించి పికెట్‌లను ఏర్పాటు చేశారు. ద్రాక్షారామ, వెంకటాయపాలెం, రామచంద్రపురం, సత్యవాడ, సుందరపల్లి, కోటిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక రక్షక దళాలను ఏర్పాటు చేశారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం విశాఖపట్నం కోర్టులో వెలువరించాల్సిన న్యాయ స్థాన తీర్పును ప్రకటించవద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీరుతెన్నులపై అభియోగాలు మోపుతూ బాధితుల తరఫున కోటి చినరాజు హైకోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి ఎస్‌వి భట్ ఈమేరకు ఆదేశాలు జారీచేశారు. అయినప్పటికీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను కొనసాగిస్తున్నారు.

ఆక్రమణదారులకు మద్దతుగా ఎమ్మెల్యే పెందుర్తి ఆందోళన

కోరుకొండ, డిసెంబర్ 13: మండలంలోని దోసకాయలపల్లి గ్రామంలో రోడ్డుకిరువైపులా ఉన్న ఆక్రమణలను రెవిన్యూ అధికారుల బుధవారం తొలగించడానికి ప్రయత్నించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సుమారు రెండు గంటలపాటు ఆక్రమణదారులకు మద్దతుగా ఆందోళన చేశారు. దీంతో రెవిన్యూ అధికారులు ఎమ్మెల్యేతో చర్చించి ఆక్రమణల తొలగింపు ప్రక్రియను వారం రోజులపాటు నిలిపివేస్తున్నట్లు కోరుకొండ తహసీల్దార్ రియాజ్‌హుస్సేన్ ఎమ్మెల్యేకు తెలిపారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఆక్రమణలను వారం రోజుల్లో తొలగించడానికి సమయం ఇవ్వాలని ఎమ్మెల్యే కోరడంతో రెవిన్యూ అధికారులు ఉన్నతాధికారులతో చర్చించి తొలగింపు పక్రియను వారం రోజులపాటు నిలిపివేసినట్టు ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు. కార్యక్రమంలో తనకాల నాగేశ్వరరావు, మార్ని బుజ్జి, మాతా సీతారాముడు, పరస శ్రీను, తెలగంశెట్టి శ్రీను, నూనె వెంకన్న, మళ్ల అప్పలనర్సారావు, సుంకర శ్రీను తదితరులు పాల్గొన్నారు.

శాగో మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు
సామర్లకోట, డిసెంబర్ 13: జిల్లా వ్యాప్తంగా సగ్గు బియ్యంను తయారు చేయడానికి శాగో పరిశ్రమల్లో కర్ర పెండలం దుంప స్థానే మొక్క జొన్నను వినియోగిస్తున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపధ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో బుధవారం సామర్లకోట మండలంలోని హుస్సేన్‌పురం, వేట్లపాలెంలోగల శాగో మిల్లులను జిల్లా సప్లయ్ అధికారి (డీఎస్‌వో) ఎ కృష్ణారావు బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తొలుత హుస్సేన్‌పురం శాగో పరిశ్రమలోనూ, తదుపరి వేట్లపాలెంలోని మూడు శాగో పరిశ్రమల్లో సగ్గు బియ్యం తయారీ విధానం, కర్ర పెండలం దుంప కొనుగోలు, తయారీ రికార్డులను పరిశీలించారు. అలాగే తయారుచేసిన సగ్గు బియ్యం శాంపిల్స్‌ను కూడా సేకరించారు. మొత్తం జిల్లాలో 16 శాగో మిల్లులను వచ్చిన ఆరోపణలపై తనిఖీలు చేపట్టమని జిల్లా జాయింట్ కలెక్టర్ నాలుగు టీంలను నియమించినట్టు డీఎస్‌వో కృష్ణారావు చెప్పారు. సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షలకు పంపనున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో పుడ్ ఇన్‌స్పెక్టర్ వై పాండురంగారావు, ఏఎస్‌వో పి సరేష్, ఆర్‌ఐ ఎం రాజేష్, వీఆర్వోలు పాల్గొన్నారు.
మరమ్మతులతో మూతపడిన ఉండూరు రైల్వేగేటు
సామర్లకోట, డిసెంబర్ 13: సామర్లకోట మండలం ఉండూరు గ్రామం వెళ్లటానికి స్థానిక ఎన్‌ఎఫ్‌సిఎల్ రిజర్వాయర్ వద్ద ఉన్న రైల్వేగేటులో మరమ్మతుల నిమిత్తం బుధవారం రైల్వేగేటును రైల్వే అధికారులు మూసి వేశారు. రైల్వేగేటులో ఇన్న పాత తారు రోడ్డును తొలగించి, కొత్తగా రోడ్డు వేసి, మరమ్మతు పనులు చేపట్టారు. దాంతో ఆకస్మికంగా రైల్వే గేటు మూసివేయడంతో సామర్లకోట నుండి ఉండూరు, అచ్చంపేట, పి వేమవరం, గొంచాల, చంద్రంపాలెం, పనసపాడు తదితర గ్రామాలకు వెళ్లే ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వారంతా ఉండూరు బైపాసు రోడ్డు నుండి సుమారు 6 కిలోమీటర్లు చుట్టూ తిరిగి సామర్లకోటకు రావాల్సి వచ్చింది. ఇంకా మరమ్మతులు కొనసాగుతున్నాయి.