తూర్పుగోదావరి

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, డిసెంబర్ 14;మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలించినా,నిల్వచేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలమూరు ఎస్సై పి దొరరాజు హెచ్చిరించారు. మండల పరిధిలో జొన్నాడలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను గురువారం ఎగుమతి చేస్తుండగా దాడి చేసి లారీని, ఎగుమతులకు ఉపయోగిస్తున్న జేసీబీని సీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
జిల్లా స్పెషల్ బ్రాంచి డీఎస్పీగా మురళీమోహన్ బాధ్యతల స్వీకరణ
రామచంద్రపురం, డిసెంబర్ 14: జిల్లా స్పెషల్ బ్రాంచీ డీఎస్పీగా సుంకర మురళీమోహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల డీజీపీ ఎన్ సాంబశివరాలు పలువురు డీఎస్పీలను బదిలీచేసిన నేపథ్యంలో ఇప్పటివరకు జిల్లా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నియంత్రణ చట్ట కేసులను పర్యవేక్షిస్తున్న సుంకర మురళీమోహన్ స్పెషల్ బ్రాంచీ డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాజమహేంద్రవరం నుంచి పిట్టా సోమశేఖర్ బదిలీ అయి బాధ్యతలను మురళీమోహన్ నుంచి స్వీకరించారు.
చరవాణీల ద్వారా అంగన్‌వాడీ ల విధులు
రంపచోడవరం, డిసెంబర్ 14: అంగన్‌వాడీ కేంద్రాల సేవలు బలోపేతానికై అంగన్‌వాడీ కార్యకర్తలు చరవాణీల ద్వారా సాంకేతికతను వినియోగించుకుని విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక స్ర్తిశిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో చరవాణి యాప్ ద్వారా కుటుంబ నిర్వహణ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల హాజరు, రోజువారీ పోషకాహారం, అంగన్‌వాడీ నిర్వహణను పూర్తిగా అప్‌లోడ్ చేయడంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని పీఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోను నిర్వహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్షేత్రస్థాయి సిబ్బందికి స్మార్ట్ఫోన్లు అందించి, స్ర్తిశిశు సంక్షేమానికి చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వం అందజేసిన చరవాణీలపై పూర్తి అవగాహన పెంచుకుని, కేంద్రాల అభివృద్ధికి అంగన్‌వాడీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కేంద్రాలకు హాజరయ్యే చిన్నారుల ఫొటోలను ప్రతిదినం అప్‌లోడ్ చేయాలన్నారు. సెల్ కవరేజ్ లేని ప్రాంతాల్లో ముందుగా డేటాను నమోదుజేసి, అనంతరం కవరేజ్ ఉన్నచోట ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లను పీఓ పంపిణీ చేశారు. కార్యక్రమంలో రంపచోడవరం సీడీపీఓ భాగ్యరేణుక, అంగన్‌వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.