తూర్పుగోదావరి

కోటిపల్లి-నరసాపురం రైల్వేలైను నిర్మాణ పనులకు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, డిసెంబర్ 14: కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులతో చర్చించి ఆటంకాలు లేకుండా స్థానిక అధికారులు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలని అమలాపురం ఆర్డీవో బి వెంకటరమణ సూచించారు. గురువారం స్థానిక కార్యాలయంలో డివిజన్‌లోని తహసీల్దార్లులు, ఎంపీడీవోలతో ఆయన వివిధ అంశాలపై సమీక్షాసమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్, వంతెన నిర్మాణాలకు అవసరం అయిన భూసేకరణ ఇప్పటికే పూర్తి చేశామని, భూమిని అందించినవారందరికీ నష్టపరిహారం కూడా చెల్లించామన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నష్టపరిహారం పెంచాలని స్థానికులు కోర్టును ఆశ్రయించారన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను బట్టి వారికి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. రైల్వే పనుల నిర్వహణలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలన్నారు. అన్ని మండలాల్లో నీటితీరువా పన్నులను నూరు శాతం పసూలు చేయాలని ఆదేశించారు. మలికిపురం మండలంలో నూరు శాతం పన్నులు వసూళు చేయగా కాట్రేనికోన మండలంలో అతితక్కువగా 60 శాతం మాత్రమే వసూలు చేసారన్నారు. మిగిలిన మండలాల్లో తక్షణమే నూరుశాతం నీటితీరువాను వసూళ్లు చేసి జమచేయాలని ఆదేశించారు. అదేవిధంగా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఓటరు నమోదు పక్రియకు సంబంధించి తక్షణమే బూత్‌లెవెల్ అధికారులు, సూపర్ వైజర్ల ఖాళీలను భర్తీచేయాలని తహసీల్దార్‌కు సూచించారు. అదేవిధంగా అమలాపురం డివిజన్‌లోని గృహనిర్మాణ పథకంపై ఆయన సమీక్ష నిర్వహించారు. 2014 జూన్ తరువాత మంజూరు కాకుండా నిర్మించుకున్న గృహాలు, ప్రగతిలో ఉన్న గృహాల వివరాలను సేకరించి వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలని ఆర్డీవో ఎంపీడీవోలు, గృహనిర్మాణశాఖ అధికారులకు ఆదేశించారు. ఎంపీడీవోలు గ్రామాల వారీగా వివరాలు సేకరించి ఆ జాబితాలను సంబంధిత గృహనిర్మాణ శాఖాధికారులకు అందజేయాలని సూచించారు. ఇసుక, ఇటుక వంటి మెటీరియల్ కొరత లేని కారణంగా గృహనిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఐ పోలవరం, అంబాజీపేట, ముమ్మిడివరం, మామిడికుదురు మండలాల్లో గృహనిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయని ఆయా మండలాల్లో వేగం పెంచాలని సూచించారు. గృహనిర్మాణ శాఖ ఇఇ సుధాకర్ పట్నాయక్ మాట్లాడుతూ 2014 జూన్ తరువాత నిర్మించుకున్న ఇళ్ల జాబితాను ఆయా గ్రామాల వీఆర్వో, కార్యదర్శులు సేకరించారన్నారు. వాటిని ఎంపీడీవోలు, తహసీల్దారు పరిశీలించి హౌసింగ్ డీఈలకు అందించాలని కోరారు.