తూర్పుగోదావరి

శక్తివంతమైన మానవ వనరులు సీనియర్ సిటిజన్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, డిసెంబర్ 17:సమాజంలో సీనియర్ సిటిజన్‌లు శక్తివంతమైన మానవ వనరులని, అనేక సంవత్సరాల ప్రభుత్వసేవలో తమ జీవితాలు, శక్తిసామర్ధ్యాలను అంకితంచేసి ఉద్యోగ విరమణ చేసి, ప్రస్తుతం సమాజ సేవలో పలువురు తమ వంతు చేయూత అందించడం పలువురి ఉద్యోగులకు ఆదర్శమని మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మండల కేంద్రమైన ఆలమూరు అఖిల భారత పింఛనుదారుల దినోత్సవం సందర్భంగా విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు తమ ఉద్యోగాలకు విరమణ చేశారే తప్ప సేవలందించేందుకు తమలో శక్తి సన్నగిల్లలేదని, ఉచిత ప్రజాసేవలోనే నిజమైన విశ్రాంతి దొరుకుతుందని అన్నారు. అనంతరం ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాలకు చెందిన విశ్రాంతి ఉద్యోగులను వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసీ ఛైర్మన్ ఈదల సత్యనారాయణ చౌదరి (నల్లబాబు), కార్యదర్శి రాయుడు సూరిబాబు, ఎంపిపి కొత్తపల్లి వెంకటలక్ష్మీ, వంటిపల్లి పాపారావు, పిఎసిఎస్ ఛైర్మన్ వంటిపల్లి సతీష్, సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు కొత్తూరి వీరన్ననాయుడు, సలాది నాగేశ్వరావు, పలువురు విశ్రాంతి ఉద్యోగల సంఘం నాయకులు పాల్గొన్నారు.
పాదగయ కీర్తిని దేశవ్యాప్తంగా చాటాలి
*పిఠాపురం ఎమ్మెల్యే వర్మ
పిఠాపురం, డిసెంబర్ 17: ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా పేర్గాంచిన పిఠాపురం పాదగయ క్షేత్రం ఆలయ విశిష్టతను దేశవ్యాప్తంగా చాటాలని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ అన్నారు. ఆదివారం పాదగయ క్షేత్రంలోని ఆలయ విశిష్టతను తెలిపే క్యాలెండర్-2018ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ఆలయానికి సంబంధించి మంచి చిత్రాలతో క్యాలెండర్‌ను రూపుదిద్దారన్నారు. ఇది భక్తులకు సమాచార పూర్వకంగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయంలో ఏర్పాట్లు చేయడం పట్ల ఆలయ ధర్మకర్తలు, అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. మన రాష్ట్రంతోపాటు, ఇతర రాష్ట్రాలకు పాదగయ సమాచారం వెళ్లేలా వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, మంచి సందేశాలను అందులో పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కొండేపూడి ప్రకాష్, ఈవో చందక దారబాబు, ఏలేరు ప్రాజెక్టు వైస్‌ఛైర్మన్ రెడ్డెం భాస్కరరావు, జైగణేష్ ఆలయ ఛైర్మన్ కోడిగుడ్డి పెద్దబాబు, పిఠాపురం అర్బన్ బ్యాంకు ఛైర్మన్ దేవరపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.