తూర్పుగోదావరి

టెట్ గందరగళోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, డిసెంబర్ 17: బిఇడి, డిఎడ్ అభ్యర్థులు కోటి ఆశలతో ఎదురు చూసిన ఉపాధ్యాయ నియామక అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విద్యార్థులు, టెట్‌కు హాజరయ్యే అభ్యర్తులు, యాజమాన్యాలను గందర గోళానికి గురిచేస్తోంది. విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఇంత వరకూ పాఠాలు బోధిస్తున్న పాఠశాలలను వదిలి కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలు, జూనియర్ కళాశాలల్లో బోధనా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యాలకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. విద్యాసంవత్సరం మధ్యలో పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు పాఠశాలలను వదిలి వెళ్లడానికి యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. అర్ధాంతరంగా పాఠశాలలను వదిలి వెళితే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని యాజమాన్యాలు లబోదిబో మంటుంటున్నాయి. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలైతే ముందు జాగ్రత్తగా ఉద్యోగాల్లో చేరేటప్పుడు వారి వద్ద ఒరిజినల్ సర్ట్ఫికెట్లతోపాటు బాండ్లు, ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకున్నారు. ప్రస్తుతం కోచింగ్‌ల పేరుతో వెళ్లిపోతామంటున్న డిఎస్సీ అభ్యర్థులకు యాజమాన్యాలు చుక్కలు చూపిస్తున్నారు. కాంట్రాక్టు ముగిసేంత వరకూ సర్ట్ఫికెట్లు ఇచ్చే ప్రసక్తేలేదని, కాదని వెళితే లీగల్‌గా వెళతామని భయబ్రాంతులను చేస్తున్నారు. దీంతో డీఎస్సీపై ఆశలు పెంచుకున్న అభ్యర్థులు తీవ్ర మనస్థాపానికి లోనవుతున్నారు. రాకరాక నోటిఫికేషన్ వచ్చిందని, ఈ అవకాశాన్ని జారవిడిస్తే జీవితాంతం వెట్టి చాకిరీ చేయాలని, ఈసారి చావో రేవో తేల్చుకునేందుకు డిఎస్సీ అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలో యాజమాన్యాలు, ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరి వాదన వారు వినిపించుకుంటున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఇంటర్, పాఠశాలలో టెన్త్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని, ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్, మే నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఇటు యాజమాన్యాలు, అటు ఉపాధ్యాయ అభ్యర్థులు కోరుతున్నారు. అభ్యర్థుల బలహీనతను ఆసరాగా తీసుకుంటున్న కోచింగ్ సెంటర్లు మాత్రం అందినకాడికి దండుకునే పనిలో పడ్డాయి.

కాలువలో జారిపడి వ్యక్తి మృతి
డి గన్నవరం, డిసెంబర్ 17 : ప్రమాదవశాత్తు కాలువలోకి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఊడిమూడి గ్రామ పంచాయతీ శివారు ఆదిమూలంవారి పాలెం గ్రామానికి చెందిన దిరిశాల పేరయ్య (65) ఆదివారం ఉదయం కూలిపనికి వెళ్లే నిమిత్తం ఇంటి నుండి బయలుదేరి వెళ్లాడు. రాజవరం - పొదలాడ ప్రధాన పంటకాలువ బెల్లంపూడి గ్రామం వద్ద ముఖం కడుకొనేందుకు పాంచాలరేవులోకి దిగగా కాలుజారి కాలువలో మునిగి గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిలో కొట్టుకుపోయాడు. దీంతో స్థానికులు బంధుమిత్రులు కాలువ వెంబడి వెతకగా మొండెపులంక లాకుల వద్ద శవమై తేలాడు. పి గన్నవరం ఎస్‌ఐ మృత దేహాన్ని వెలికితీయించి కేసు నమోదు చేసి పోస్టుమార్టమ్ నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి చేరుకొని మృతిని కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు.