తూర్పుగోదావరి

సత్యదేవుని సేవలో వైసిపి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, ఏప్రిల్ 17: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదివారం దర్శించారు. అన్నవరంలో కన్నబాబుకు అన్నవరం పట్టణ పార్టీ అధ్యక్షుడు రాయవరపు భాస్కరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రత్నగిరిపైకి చేరుకున్న కన్నబాబు స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి యంత్రాలయం వద్ద కన్నబాబుకు దేవస్థానం వేద పండితులు వేదాశీస్సులు అందించి, స్వామివారి ప్రసాదం అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపి నాయకులు దడాల సతీష్ సరమర్ల మధుబాబు, కొండపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.