తూర్పుగోదావరి

ఎస్సీ వర్గీకరణ బాధ్యత చంద్రబాబుదే ఎపి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 17: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టించి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని ఎపి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జన్ని రమణయ్య అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన అమలాపురంలో పర్యటించారు. స్థానిక కాటన్ గెస్ట్ హౌస్‌లో జిల్లా మాదిగ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మడికి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రశంగించారు. ఎన్నికల సందర్భంగా వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి తాను పెద్దమాదిగను అవుతానని చంద్రబాబు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని రమణయ్య హితవు పలికారు. వర్గీకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైధానంలో నిర్వహించనున్న మాదిగల దండోరా దండయాత్ర మహాసభకు లక్షలాధిగా తరలివచ్చి విజయవంతం చేయాలని రమణయ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపి ఎంఇఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉందుర్తి సుబ్బారావు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బూరిగ సంజయ్, గౌరవ అధ్యక్షడు మడికి వసంతరావు, అమలాపురం డివిజన్ అధ్యక్షులు బి సర్వారాయుడు, గౌరవ అధ్యక్షులు మడికి సత్యనారాయణ, యార్లగడ్డ జాన్‌సుందర్రాజు తదితరులు మాట్లాడారు. అంతకుముందు అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈనెల 30న అనంతరపురంలో ఎంఆర్‌పిఎస్ మహాసభ పోస్టర్‌ను రమణయ్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో మోకాటి నాగేశ్వరరావు, కె కృపావరం, యార్లగడ్డ జిర్జి, సి సత్యనారాయణ, కె అంజిబాబు, కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.