తూర్పుగోదావరి

క్రీడలతో కీర్తి ప్రతిష్ఠలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పలగుప్తం, ఫిబ్రవరి 13: దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టడంతో పాటు క్రీడాకారుల్లో క్రమశిక్షణ, మానసిక వికాసం, వ్యక్తిగత గుర్తింపును తీసుకురావడంలో క్రీడలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ఎక్సయిజ్ శాఖా మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జడ్పీ హైస్కూలు మైదానంలో ఎన్‌వీఆర్ మెమోరియల్ జాతీయ వాలీబాల్ టోర్నమెంటును మంగళవారం ఆయన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పలో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభలో జవహర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో జాతీయస్థాయిలో ఇటువంటి క్రీడలు నిర్వహించడం క్రీడాకారుల్లో ఎంతో ఉత్సాహం కలిగిస్తోందన్నారు. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పీవీ సింధు డిప్యూటీ కలెక్టర్‌గా నియమించబడ్డారంటే ఆమె క్రీడల్లో చూపిన ప్రతిభేనని మంత్రి గుర్తు చేసారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్‌విఆర్ టోర్నమెంటు పేరుతో గత నాలుగు సంవత్సరాలుగా జాతీయస్థాయిలో మారుమూల గ్రామంలో పోటీలు అద్భుతంగా జరగడం గొప్ప విషయమని, జాతీయ స్థాయి క్రీడాకారులను ఈ ప్రాంతానికి రప్పించి గ్రామీణ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపుతున్న రాజప్ప, ఆయన సోదరుడు జగ్గయ్యనాయుడు అభినందనీయులని రెడ్డి కొనియాడారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ఈ ప్రాంతంలో టోర్నమెంటు నిర్వహించడంతో ఈ గ్రామానికి భారతదేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ఈ పోటీలు భారతదేశంలోనే నిర్వహించే గ్రామీణ వాలీబాల్ పోటీల్లో గుర్తింపు పొందిందన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం క్రీడా ప్రాంగణాన్ని మంత్రి జవహర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, పులపర్తి నారాయణమూర్తి, వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగదీశ్వరి, బండారు సత్యానందరావు, మాజీ జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, మెట్ల రమణబాబు, అమలాపురం ఆర్డీవో బివి రమణ, అమలాపురం మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, స్పోర్ట్స్ అథార్టీ చైర్మన్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.