తూర్పుగోదావరి

జన సంద్రమైన కోటిపల్లి శైవక్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, ఫిబ్రవరి 13: కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామం మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసంద్రమైంది. ఉదయం 8 గంటల వరకు భక్తులు పెద్దగా రాకపోగా ఆ తరువాత భక్తజనం రాకపోకలు అధికమయ్యాయి. దీంతో ముందుగానే అంచనాలు వేసుకున్న అధికారులు అప్రమత్తమై భక్తులకు అవసరమైన ఏర్పాట్లను క్షణాలపై నిర్వహించారు. గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలాచరించిన భక్తులు కోటిపల్లి ఛాయా సోమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్నాన ఘట్టాల వద్ద, ఆలయం వద్ద ఆర్డీవో ఎన్ రాజశేఖర్, డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్‌ల నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చూశారు. పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఏర్పాటు చేయడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్‌విఎస్ నాగేశ్వరరావు, కాకినాడ డిపో మేనేజర్ పాలూరి భాస్కరరావుల నేతృత్వంలో అధికారులు నిరంతరం భక్తులను తరలించారు. ఆలయం వద్ద దేవదాయ ధర్మదాయ శాఖ తనిఖీదారు వర్ధినీడి వెంకటేశ్వరరావు (నాని), కోటిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పప్పుల మసేను వెంకన్న (రేవు శ్రీను), బీజేపీ నాయకుడు కర్రి చిట్టిబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రరావు, తహసీల్దార్ కెజె ప్రకాష్‌బాబు, ఎంపీడీవో డివిఎల్‌ఎన్ శాస్ర్తీ, తదితర అధికారులు భక్తులకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, ఎనిమిది మంది గ్రామ రెవిన్యూ అధికారులు కోటిపల్లి మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణలో పాల్గొన్నారు. రామచంద్రపురం సీఐ కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్, మండపేట రూరల్ ఇనస్పెక్టర్ కె లక్ష్మణరెడ్డి తదితర పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. తొలిసారిగా డ్రోన్ కెమెరాతో మోనిటర్‌ను అనుసంధానిస్తూ, నేర నిరోధక చర్యలను నిర్వహించారు. వివిధ స్వచ్ఛంద సేవాసంస్థలు, సామాజిక సంఘాలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించాయి. కోటిపల్లిలోని శ్రీ పైండా వెంకన్న రామకృష్ణయ్య అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీపైండా జగన్నాథ సుబ్రహ్మణ్య సత్యప్రసాద్ జమీందార్ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించారు. కాగా కోటి దీపోత్సవం, గ్రామోత్సవం నిర్వహించేందుకు అర్చకులు కొత్తలంక సోమసుబ్రహ్మణ్యశర్మ, జంధ్యాల శివశంకర్, ఆలయ ఈవో కె రామచంద్రరావు అంకురార్పణ చేశారు.