తూర్పుగోదావరి

పశువుల వ్యాధుల పట్ల అవగాన పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజోలు, ఏప్రిల్ 19: రైతులు పశువుల వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సయిజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాజోలు పశువుల ఆసుపత్రి వద్ద మంగళవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పశువులకు సోకే గొంతువాపు వ్యాధి, గాలికుంటు వ్యాధులకు టీకాలు ఇప్పించాలని సూచించారు. ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పశువుల బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రైతులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సభాపతి ఎవి సూర్యనారాయణరాజు, భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, సర్పంచ్ మద్దా కృష్ణకుమారి, ఎంపిటిసిలు రేవు జ్యోతి, చెల్లింగి జాంబవతి, కోళ్ల వెంకన్న, రాజోలు పశువుల ఆసుపత్రి అసిస్టెంటు డైరెక్టర్ డాక్టర్ గొల్ల జేసురత్నం, డాక్టర్ ఎం దినకర్, డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.