తూర్పుగోదావరి

5 నెలల్లో ఉప ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 18: కేవలం ఐదు నెలల వ్యవధిలోనే శరవేగంగా రాజమహేంద్రవరం బొమ్మూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి (అప్కాస్ట్) ఉప ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రాన్ని నిర్మిస్తామని, ఈమేరకు అధికారులను ఆదేశించామని రాష్ట్ర అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. బొమ్మూరులో ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ. 16.80 కోట్ల కేంద్ర, రాష్ట్ర నిధులతో నిర్మించనున్న ఉప ప్రాంతీయ కేంద్రానికి ఎంపీ మాగంటి మురళీమోహన్ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శిద్ధా రాఘవరావు, ఎంపీ మాగంటి మురళీమోహన్‌కు స్థానిక టీడీపీ నేత మత్సేటి శివసత్యప్రసాద్ ఘనస్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఆప్కాస్ట్), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్‌సిఎస్‌ఎం) సంయుక్తంగా ఈ సైన్స్ సెంటర్‌ను నిర్మిస్తున్నాయి. ఎంపీ మాగంటి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి శిద్ధా మాట్లాడుతూ అభివృద్ధికి సైన్స్ చాలా కీలకమన్నారు. త్రీడీ థియేటర్‌ను కూడా నిర్మిస్తున్నామని, ఇప్పటికే మంజూరైన నిధులతో పాటు అదనంగా ఇప్పటికిపుడు రూ.1.60 కోట్లు నిధులు కేటాయించి ఇదే ప్రాంగణంలో సైన్స్ హబ్‌ను కూడా నిర్మించనున్నట్టు మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైన్స్ పరంగా చేస్తున్న కృషి వల్ల ఏపీ టెక్నాలజీలో భారత్‌లోనే ముందుందన్నారు. రానున్న రోజుల్లో ఆప్‌కాస్ట్‌ను మరింత పటిష్టవంతం చేస్తున్నామన్నారు. మరో రెండు మూడు జిల్లాల్లో సైన్స్ సిటీలను ఏర్పాటు చేయనున్నామన్నారు.
ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం గత రెండేళ్ళుగా కృషి చేశామన్నారు. విద్యార్థులకు ఈ కేంద్రం ఒక క్షేత్ర స్థాయి అధ్యయన కేంద్రంగా ఉపయోగపడుతుందని, ఉత్తమ భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఈ కేంద్రం ప్రయోజనాన్ని గుర్తించాలన్నారు. రానున్న రోజుల్లో బిర్లా ప్లానిటోరియాన్ని కూడా ఇక్కడకు తీసుకొచ్చేందుకు కృషిచేస్తామన్నారు. వచ్చే ఏడాది మే నాటికి ఎన్నికలు వచ్చే అవకాశం వుందని, ఈలోగానే ఈ కేంద్రం నిర్మాణం పూర్తి కావాల్సి వుందని, డిసెంబర్‌లోగా పూర్తిచేసేందుకు మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించడం పట్ల అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలు, ఎంపీలను కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేయిస్తున్నారని, ఆయన ఇరవై నాలుగు గంటలూ పని చేస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారన్నారు. తమ పనితీరును బట్టి ఎప్పటికపుడు ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తున్నారని, ఎక్కడైనా తేడా వస్తే దొరికిపోతామని, అందుకే నిత్యం ప్రజల్లోనే పని చేయాల్సి వుందన్నారు. కేవలం రెండు గంటల్లోనే రెండు రాష్ట్రాలను విడిగొట్టేయడంతో కష్టాల్లో పడిన ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతూ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. దేశ విదేశాలకు తిరుగుతూ పరిశ్రమల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టాలని ఆహ్వానిస్తున్నారని, దేశంలోనే ఏకైక ప్రగతి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఇపుడున్న ప్రగతి కుంటుపడకుండా రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలన్నా, మన పిల్లల భవిష్యత్ బాగుండాలన్నా, అందరి ఆశీస్సులతో చంద్రబాబునాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఎంపీ మాగంటి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ తన విద్యాసక్తికి తన చిన్నపుడు లక్నోలో తిలకించిన ఇటువంటి సైన్స్ కేంద్రమే అంకురార్పణ అయిందని చెప్పుకొచ్చారు. విద్యార్థులకు ఈ కేంద్రం ఒక మేధోకేంద్రంగా దోహదపడుతుందని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తారన్నారు. అంతర్జాతీయ చర్చాగోష్టులు కూడా నిర్వహించుకునే విధంగా భారీ సెమినార్ హాలు కూడా నిర్మిస్తారన్నారు. సత్వరం కేంద్రం నిర్మించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సన్నద్ధంగా వుంటుందని, ఎంపీ మాగంటి ఈ కేంద్రం కోసం ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ చారిత్రక ప్రాశస్థ్యం కలిగిన రాజమహేంద్రవరంలో ఈ కేంద్రం నిర్మించడం మరింత విశేషమన్నారు. శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశ భవిష్యత్ విద్యాలయాల్లోనే రూపొందుతుందన్నట్టు సైన్స్‌పైనే అభివృద్ధి ఆధారపడి వుందని, విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని బయటకు తీయొచ్చన్నారు.