తూర్పుగోదావరి

హోదా కోసం రాజీనామాలు చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 23: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము రాజీనామాలు చేసే ప్రసక్తి లేదని కాకినాడ ఎంపీ తోట నరసింహం స్పష్టం చేశారు. స్థానిక జిల్లా ఉపాధి శిక్షణ కార్యాలయ ప్రారంభోత్సవానికి శుక్రవారం విచ్చేసిన ఆయన మాట్లాడుతూ తాము రాజీనామాలు చేసినంత మాత్రాన ఏం ఒరగదన్నారు. జగన్ తన ఎంపీలతో రాజీనామా చేస్తానని ప్రకటించి చెవిలోపువ్వులు పెడుతున్నారన్నారు. జగన్‌కు చెందిన ఎంపీలు ఏప్రిల్ ఆరు తరువాత కాకుండా తక్షణమే రాజీనామాలు చేయవచ్చుకదాని ప్రశ్నించారు, జగన్‌ది ఓ డ్రామా కంపెనీ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని రాష్ట్రాల మాదిరిగానే నిధులచ్చిందని కొత్తగా ఏమీ ప్రకటించలేదన్నారు. చివరి బడ్జెట్ కారణంగానే రాష్ట్రానికి అధికంగా నిధులివ్వాలని తాము డిమాండ్ చేశామని ఎంపీ తోట అన్నారు.

ఎంపీ హామీతో ఓడలరేవులో థీక్షలు విరమణ
అల్లవరం, ఫిబ్రవరి 23: అల్లవరం మండలం ఓడలరేవు గ్రామాభివృద్ధి కోసం ఓఎన్‌జిసి గతంలో ఇచ్చిన హామీలు నేరవేర్చాలని గత 66 రోజులుగా గ్రామస్థులు చేస్తున్న రిలే దీక్షలు అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు హామీతో విరమించారు. ఓడలరేవు పంచాయితీ వద్ద గ్రామస్థులు నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని అమలాపురం ఎంపీ పండుల శుక్రవారం సందర్శించి మాట్లాడారు. గతంలో ఓఎన్‌జిసి గ్రామాభివృద్ధి కోసం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నేరవేర్చలేదని దీక్షాపరులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల అమలాపురం ఆర్డీవో కార్యాలయానికి చర్చలకు పిలిచి సమస్యలపై నోటి మాట ఇచ్చి ఓఎన్‌జిసి అధికారులు వెళ్లిపోయారన్నారు. గ్రామంలోని 500 ఎకరాల భూమిని ఒఎన్‌జిసి తీసుకోవడం వల్ల వ్యవసాయ కూలీలకు, కల్లు గీతకార్మికులకు పనిలేక నానాఅవస్ధలుపడుతున్నారని చెప్పారు. దీక్షలు చేస్తున్న వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసారని ఎంపీ వద్ద యువకులు ఆవేదన వ్యక్తం చేసారు. దానికి ఎంపీ రవీంద్రబాబు స్పందిస్తూ తాను ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అమలాపురం ఆర్డీవో ఓడలరేవు గ్రామ సమస్యలపై 18డిమాండ్లను తయారుచేసి ఓఎన్‌జిసి అధికారులకు పంపగా, వాటిని అమలు చేయడానికి ఓఎన్‌జీసీ అధికారులు అంగీకరించారన్నారు. గ్రామంలో ఎవరైనా అధిక వ్యయంతో కూడిన వ్యాధులకు గురైతే వారికి ఓఎన్‌జిసి ద్వారా కార్పొరేట్ వైద్యం చేయించే ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రామస్థులు కోరిన విధంగానే త్రాగునీరు, విద్యుత్ బిల్లులు, ఓఎన్‌జిసి చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. ఓడలరేవులో నిర్మించబోతున్న వశిష్ఠ - 2 ఒఎన్‌జిసి ప్రాజెక్టులో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దీక్షలు చేస్నున్న యువకులపై బైండోవర్ కేసులు ఎత్తివేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి వారితో దీక్షలు విరమింప చేశారు. కార్యక్రమంలో మోకా వెంకటరమణ, తాడి శివ, కోమాటి రమణ, మధుర లక్ష్మి, వి లక్ష్మి, తహసీల్దార్ వి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీనీ నిలదీసిన కార్యకర్తలు
ఓడలరేవులో రిలే దీక్షలు సందర్శించేందుకు వస్తున్న అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబును ఓడలరేవు మరిడమ్మ సెంటర్‌లో గ్రామంలోని తెలుగుదేశం నాయకులు నిలదీసారు. నాయకులకు ఏవిధమైన సమాచారం ఇవ్వకుండా మండలంలోని వైసీపీ కార్యకర్తలను వెంటపెట్టుకుని ఎంపీ రావడాన్ని స్థానిక టీడీపీ నాయకులు తమ అక్కసును వెళ్లబుచ్చారు. దీక్షలు చేస్తున్న ఆందోళన కారులు ఇటీవల ఎంపీపై ఎన్నో ఆరోపణలు చేసినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో కొల్లు బాబ్జి, కలిగితి ఏసురత్నం, సత్యనారాయణ, కొప్పాడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.