తూర్పుగోదావరి

నరసన్న ఆలయంలో నిర్మాణాలు చట్టవిరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుకొండ, మార్చి 21: చరిత్ర ప్రసిద్ధి చెందిన చరిత్రాత్మకమైన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ప్రాగంణంలో అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించడం చట్టవిరుద్ధమని పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరత్నం అన్నారు. కోరుకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఉత్తరం వైపు షెడ్డుకోసం జరుగుతున్న పనులను నిలుపుదల చేయించారు. అనుమతులు తెచ్చుకొని పనులు చేపట్టుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నరసింహస్వామి వారి ఆలయంలో కాకతీయుల రాజైన రుద్రమదేవి కాలంలో మండపం నిర్మించారని, ఇటువంటి మండపాలను ముందు తరాలకు అందించవలసిన బాద్యత అందరిపైనా ఉందన్నారు. స్థానిక అధికారులకు జివోలు, పురావస్తు శాఖ చట్టాలు తెలియక కట్టడాలు, నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నారని, ఇవి ఎంతమేరకు చెల్లవని స్పష్టం చేశారు. పురావస్తు శాఖ 1960 చట్టం ప్రకారం ఏ విధమైన నిర్మాణాలు చేసినా శిక్షార్హులు అవుతారన్నారు. ఇటువంటి నిర్మాణాలు చట్టవిరుద్ధమన్నారు. కాకతీయులు నిర్మించిన మండపం ఎనిమిది వందల సంవత్సరాలు పూర్తవుతుందని, సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఈ ఆలయాలు ఉండాలని శాసనాలు ఉన్నాయని పేర్కొన్నారు. పైపై మెరుగులు దిద్దడానికి ఉన్న ఆలయాలను పాడుచేస్తున్నారన్నారు. చరిత్రకు మూలాధారమైన శాసనాలు, కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందన్నారు. షెడ్డుకోసం చేస్తున్న నిర్మాణ పనులను అనుమతి వచ్చే వరకూ పనులు ఆపాలని అన్నవరం అధికారులను ఆదేశించారు. అదే విధంగా హైకోర్టు ఆదేశాలు, ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల పత్రాన్ని ఆలయ ఉద్యోగి రవికుమార్‌కు అందజేశారు. ఈ ప్రాంగణంలో కాకతీయుల కాలం నాటి కల్యాణ మండపానికి ఏ విధమైన నష్టం జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు జరపాలంటే పాత నిర్మాణాలను పాడుచేయకుండా పురావస్తు శాఖ సూచనల మేరకు చేయవలసి ఉంటుందన్నారు. అనంతరం ఆయన రంగరాజస్వామి వారి ఆలయాన్ని పరిశీలించారు.

టెట్‌లో ఇంగ్లీషులో వీరేంద్రరెడ్డికి మొదటి ర్యాంకు
రావులపాలెం, మార్చి 21: రావులపాలెం శ్రీ సత్యసాయి డిఎడ్ కళాశాల ఇంగ్లీషు ఉపాధ్యాయులు కర్రి వీరేంద్రరెడ్డి ఇటీవల విడుదలైన ఎపి టెట్-2017లో ఇంగ్లీషు విభాగంలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించినట్టు కళాశాల డైరెక్టర్ ఎన్ రవిచంద్ర బుధవారం విలేకర్లకు తెలిపారు. పేపర్-3 ఇంగ్లీషులో వీరేంద్రరెడ్డి 150కు 127 మార్కులు సాధించారన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ ఎన్‌వి సత్యనారాయణరాజు, డైరెక్టర్లు రవిచంద్ర, సిబ్బంది వీరేంద్రరెడ్డిని అభినందించారు.

జనసేన నిరసన
కాకినాడ, మార్చి 21: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పిలుపు మేరకు సాయంత్రం విగ్రహం వద్ద నోటికి నల్ల రిబ్బన్లను ధరించి హోదాకై ప్లకార్డులను ప్రదర్శించారు. పవన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం విశేషంగా శ్రమిస్తున్నారని జనసేన నాయకులు తుమ్మలపల్లి చందు, కుంపట్ల గోపాల్, నల్లం శ్రీనివాస్‌లు అన్నారు. ఈ నిరసనలో జనసేన నాయకులు బన్నీ, కృష్ణప్రియ, కడలి ఈశ్వరి, వెంకటేష్, అంజలి తదితరులు పాల్గొన్నారు.