తూర్పుగోదావరి

అన్నకు తలకొరివి పెట్టిన చెల్లె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, మార్చి 21: తల్లిదండ్రులు విడిపోవడం ఆ పిల్లల పాలిట శాపంగా మారింది. చివరకు కన్నకొడుకు అతి చిన్న వయస్సులో చనిపోయినా సమాచారం అందచేసినా కడసారి చూపు చూడడానికి తలకొరివి పెట్టడానికి సైతం ఆ కసాయి తండ్రి ససేమిరా అంటూ రాకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో సొంత చెల్లెలు చనిపోయిన అన్నకు తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించిన విషాద సంఘటన ఇది. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పాత్రులపేటలో ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. సామర్లకోటకు చెందిన పద్మావతికి పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి గోవిందరాజుకు వివాహమై వెంకట శివ (25), సత్య(20) అనే ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే భార్యభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి 2005లో విడాకులు తీసుకున్నారు. ఈ వివాదం నేపథ్యంలో తల్లివద్ద ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. శివకు గత కొంతకాలంగా వెన్నుపూసలో సమస్య రావడంతో రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి. సుమారు మూడేళ్లుగా మంచం మీదనుండి లేవలేని పరిస్థితి. తల్లి పద్మావతి, చెల్లి సత్య కూలీపనులు చేసుకొంటూ శివ మంచి చెడ్డలు, వైద్యం చేయిస్తున్నారు. కనీసం అనారోగ్యం పరిస్థితి తెలిపి చూడమన్నా తండ్రి రాలేదని వారు వాపోయారు. చెన్నై, హైదరాబాద్ తదితర ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం వెంకట శివ మృతిచెందాడు. కుమారుడు మరణించాడని, రావాలని సామర్లకోట నుండి ఫోనులో ప్రస్తుతం అత్తిలి విఆర్వోగా పనిచేస్తున్న తిరుమలశెట్టి గోవిందరాజుకు బంధువులు సమాచారం ఇవ్వగా తనకు సంబంధం లేదని చెప్పడన్నారు. దాంతో ఎంతకీ తండ్రి రాకపోవడంతో, వెంకట శివ చెల్లెలు సత్యతో అంతిమ సంస్కారంను పెద్దలు నిర్వహింపచేశారు. స్వయంగా చెల్లెలు అన్న శవయాత్ర ముందు భాగంలో నడచుకుంటూ వెళ్ళింది. శ్మశానవాటికలో సత్య అన్నకు సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది. స్థానికంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. మరణించాక శత్రువు వద్దకు సైతం వెళ్ళి చూడాలని చెబుతుండగా, కన్న కొడుకును సైతం చూడడానికి ఆ తండ్ర రాకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.

కమ్యూనిటీ హాళ్లకు నిధులు మంజూరు చేయాలి
శాసనసభలో పులపర్తి
డి.గన్నవరం, మార్చి 21: గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిర్మించి విడిచిపెట్టిన కమ్యూనిటీ హాళ్లకు నిధులు మంజూరు చేయాలని బుధవారం శాసనసభ జీరో అవర్‌లో ప్రస్తావించినట్టు ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఫోన్ ద్వారా తెలిపారు. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఎస్సీ, బీసీలకు చెందిన 16 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు మొదలుపెట్టి అసంపూర్తిగా వదిలేసాశారని, ఇందువల్ల అవి నిరుపయోగంగా ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. సదరు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తిచేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు బదులిస్తూ ఎస్టిమేషన్‌లు తయారు చేయించి పంపినట్టయితే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి వివరించారు.

‘హోదా’కోసం జనసేన వౌన ప్రదర్శన
అమలాపురం, మార్చి 21: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు బుధవారం స్థానిక నల్లవంతెన సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం ఎదుట నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని వౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జనసేన నాయకుడు సూదా చిన్న మాట్లాడుతూ ప్రత్యేక హోదాకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబించడం వల్లే ప్రస్తుతం రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందన్నారు. హోదాకోసం పోరాడుతున్న సమయంలో హోదాతో పనిలేదు ప్యాకేజీ ముద్దంటూ రాష్ట్ర ప్రజలను మోసగించారన్నారు. అధికారం చేపట్టక ముందు బీజేవీ ఒక విధంగాను, అధికారంలోకి వచ్చాక మాట మార్చి మాట్లాడటం దారుణమన్నారు. ప్రత్యేక హోదాకోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న పవన్ కళ్యాణ్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని చిన్న హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి టీ జీవన్‌కుమార్, బట్టు పండు, మహాదశ నాగేశ్వరరావు, సుంకర వెంకట బాబ్జీ తదితరులు నాయకత్వం వహించారు.