తూర్పుగోదావరి

రహదారి భద్రతను పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 21: జిల్లాలో రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా ఆయా వర్గాల ప్రజలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. భద్రతకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికార్లను కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం కాకినాడలోని కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదాల కారణంగా 60 మంది మృతిచెందినట్టు నివేదికలు చెబుతున్నాయన్నారు. ఇది చాలా అప్రమత్తం కావల్సిన అంశమని, ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వాహనాల వేగాన్ని నియంత్రించడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారని, ఇది ఎంతమాత్రం సమర్ధనీయం కాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపై వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాలోని చింతూరు ఘాట్ రోడ్డులో భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాలని సూచించారు. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో ట్రాఫిక్ అథికంగా ఉండే కూడళ్ళలో సిగ్నల్ లైట్ల పనితీరు మెరుగుపరచేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారుల్లో వాహనాల వేగంపై నిఘా ఉంచాలని, ఆటోలు, ఇతర వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజమహేంద్రవరం దివాన్‌చెరువు వద్ద గామన్ బ్రిడ్జి కూడలి వద్ద ట్రాఫిక్ ఐలాండ్‌ను నిర్మించాలని, రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో జంక్షన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి ఆయా ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇన్‌ఛార్జి డీటీసీ సిరి ఆనంద్, రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ సిఎస్‌ఎన్ మూర్తి, ఎన్‌హెచ్ 16 పీడీ వెంకటరత్నం, ఒఎస్‌డి రవిశంకర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్‌పి మురళీమోహన్, ట్రాఫిక్ డిఎస్‌పిలు రమణకుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.