తూర్పుగోదావరి

విఆర్ పురంలో తాగునీటి ఎద్దడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఆర్ పురం, ఏప్రిల్ 17: మండల కేంద్రం విఆర్ పురంలో తాగునీటికి కటకటలాడుతూ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. విఆర్ పురంలోని సంత పాకల దగ్గర నుంచి పోస్ట్ఫాస్ సెంటర్ వరకు మూడు రోజులుగా నీటి కోసం అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా బీసి కాలనీ వాసులకు రక్షిత మంచినీటి పథకం పని చేయకపోవటంతో వారం రోజులుగా తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నా, ఏ ఒక్క అధికారీ కూడా పట్టించుకున్న పాపాన పోవటంలేదని ప్రజలు వాపోతున్నారు. అసలే ఎండలు విపరీతంగా కాస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, ప్రజలు చేతి పంపులను ఆశ్రయిద్దామంటే అవి కాస్తా మొరాయిస్తున్నాయి. రాజీవ్‌గాంధీ సెంటర్ వద్దగల పంపు, డొంకవీధిలోని పంపు అసలు పనిచేయటం లేదు. దీంతో చేతి పంపుల వద్ద, పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న బావి వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. పంపులేమో కొట్టగా, కొట్టగా ఎప్పటికోగానీ నీళ్లురావు, బావి వద్ద అడుగంటిన నీళ్లను తోడటానికి బావికి గిరకలు పనిచేయక పోవటంతో తాగునీటి కోసం స్థానిక ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. చెంతనే శబరీ గోదావరి జీవనదులు ప్రవహిస్తున్నా సాగు, తాగునీటి కోసం ప్రతీ ఏటా నానా పాట్లు పడాల్సి వస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి కోసం అవస్థలు పడుతున్న విఆర్ పురం వాసులకు వెంటనే తాగునీరు అందించాల్సిన అవసరం ఎంతైనావుంది.

దేశానికే ఆదర్శం జిల్లా పరిషత్
*మండలి డిప్యూటీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యం
కొత్తపేట, ఏప్రిల్ 17: దేశానికే ఆదర్శంగా తూర్పుగోదావరి జిల్లా పరిషత్ నిలుస్తుందని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద జిల్లా పరిషత్ శతవసంతాల ఉత్సవాలను మంగళవారం మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. జిల్లా పరిషత్ జెండాను ఆవిష్కరించిన అనంతరం గోడపత్రికలతోపాటు కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎంపీపీ రెడ్డి అనంతకుమారి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రసంగిస్తూ తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా ఎంతోమంది ఉద్దండులు పనిచేశారన్నారు. వారిలో తోర రామస్వామితో పాటు జడ్పీ ఛైర్మన్ నుంచి లోక్‌సభ స్పీకర్ అయిన జీఎంసీ బాలయోగి లాంటి వారు ఉన్నారన్నారు. వారి స్ఫూర్తితో అంతా పనిచేయాలని కోరారు.