తూర్పుగోదావరి

అటవీ నేరాల నిరోథానికి సమన్వయంతో పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 25: అటవీ సంబంధమైన నేరాల నిరోధానికి ఫారెస్టు, పోలీసు తదితర శాఖలు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని రాష్ట్ర డీజీపీ డాక్టర్ ఎం మాలకొండయ్య అన్నారు. ఎర్ర చందనం ప్రస్తుతం ప్రధాన అటవీ నేరంగా పరిణమించిందని, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి శాఖల మధ్య సమన్వయం ప్రధానావసరమన్నారు. బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అకాడమిని ఆయన సందర్శించి శిక్షణలో వున్న ఫారెస్ట్ సెక్షన్, బీట్ అధికారుల సభలో మాట్లాడారు.
ఎర్ర చందనం చెట్లను నరికేవారు ఒకరైతే, రవాణా మరొకరు, మార్కెటింగ్ ఇంకొకరు..ఇలా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వివిధ స్థాయిల్లో వేర్వేరు వ్యక్తులు భాగస్వాములవుతూ ఉంటారన్నారు. దుబాయ్, మలేషియాల్లో నివసించేవారు కూడా ఈ స్మగ్లింగ్‌లో పాత్రదారులనే విషయం తెలిసిందేనన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ అనే పెద్ద రాకెట్‌ను నిరోధించడాన్ని ప్రతీ అధికారి సవాల్‌గా తీసుకోవాలన్నారు.
అటవీ శాఖ ప్రధాన విధి వన సంరక్షణ కాగా ఈ కర్తవ్య నిర్వహణలో బీట్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని డీజీపీ అన్నారు. వన సంపద పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణ రెండూ అవిభాజ్యమైన విధులన్నారు. జీవవైవిధ్యం పరిరక్షించబడినపుడే మానవుడి మనుగడ సజావుగా సాధ్యపడుతుందన్నారు. అడవుల్లోని పెద్ద చెట్ల వల్ల ఆర్థికపరమైన లాభాలు పెద్దగా వుండవని, కానీ ప్రకృతి సమతుల్యత పరిరక్షణకు అవి చాలా కీలకమన్నారు. పెద్ద చెట్లు పక్షులకు ఆవాసంగా వుంటాయని, అలాగే వర్షం నీటిని ఎక్కువగా భూమిలోకి పంపి భూగర్భ జలాల స్థాయిని రక్షిస్తాయని చెప్పారు. అలాగే భూసారానికి రక్షణ ఇస్తాయన్నారు. దేశానికి ఎంతో మేలు చేసే అటవీ శాఖలో పని చేస్తున్నందుకు ప్రతీ ఉద్యోగి గర్వించాలని, తన విధిని అంకితభావంతో నిర్వర్తించాలని సూచించారు. సభకు అధ్యక్ష వహించిన ముఖ్య అటవీ సంరక్షణాధికారి జెఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ అటవీ శాఖకు మూలస్ధంభాల వంటి ఎఫ్‌బిఒలు, ఎఫ్‌ఎస్‌లతో మాట్లాడానికి డీజీపీ ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడికి వచ్చారన్నారు. అటవీ శాఖ విధులు, కార్యకలాపాలపై డీజీపీ మాలకొండయ్యకు చక్కని అవగాహన వుందని ప్రసంశించారు. అటవీ అకాడమికి పోలీసు శాఖ అత్యున్నత అధికారి వచ్చి శిక్షణలో వున్న అధికారులతో మాట్లాడ్డం ఇదే తొలిసారి అని చెప్పారు. విధి నిర్వహణలో తామంతా మాలకొండయ్యను రోల్‌మోడల్‌గా భావిస్తామన్నారు. తొలుత అకాడమీ ప్రాంగణంలో డీజీపీకి అటవీ క్షేత్రాధికారులు గౌరవ వందనం సమర్పించారు. సభానంతరం డీజీపీ మాలకొండయ్యను సీసీఎఫ్ ఇతర ఉన్నతాధికారులు సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సభకు అకాడమి డిప్యూటీ డైరెక్టర్ ఎంవి ప్రసాదరావు స్వాగతం పలుకగా, రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ బి రాజకుమారి, కాకినాడ డిఎఫ్‌ఓ డాక్టర్ నందని సలారియా, డిఎఫ్‌ఓ వైల్డ్‌లైఫ్ అనంతశంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక మహాపుష్కర నగరవనంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన ఓపెన్ ఎయిర్ యాంఫి థియేటర్‌ను డీజీపీ మాలకొండయ్య ప్రారంభించారు. ప్రాంగణంలో మొక్కలు నాటారు.