తూర్పుగోదావరి

బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 25: తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముఖ అని చెబుతూ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచరణలో వెనుకబడిన వర్గాలను వెన్నుపోటు పొడుస్తున్నారని ఏపీ కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు వాపోయారు. ఏపీసీసీ పిలుపు మేరకు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఎదురుగా గల మహాత్మ జ్యోతీరావు పూలే విగ్రహం వద్ద బుధవారం చంద్రబాబు వైఖరికి నిరసనగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడారు. జాతీయ బీసీ కమీషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య వెల్లడించిన వాస్తవాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక విషయంలో బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారంటూ చంద్రబాబు సమర్ధించినట్టు చెప్పడం బాధాకరమన్నారు. 2016 ఏప్రిల్ 30న అప్పటి హైకోర్టు ఏక్టింగ్ చీఫ్ జస్టిస్ దిలీప్ బి బోస్లే ఆరుగురిని న్యాయమూర్తులుగా నియామకానికి సూచించారని, దీనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల అభిప్రాయాలు కోరారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నెల రోజుల్లోగా తన అభిప్రాయాన్ని చెప్పగా, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం 11 నెలలు కాలయాపన చేసి, 2017మార్చి 21న తన అభిప్రాయాన్ని పంపినట్టు వెల్లడయ్యిందన్నారు. నివేదికలో ఆరుగురిలో ఇద్దరు బీసీ అభ్యర్ధులు, ఒక దళిత అభ్యర్ధి, మరో ఒక ఇతర సామాజికవర్గం అభ్యర్ధిపై తప్పుడు ఆరోపణలు చేసి, వారు న్యాయమూర్తుల పదవులకు పనికి రారంటూ మోకాలడ్డారని పేర్కొన్నారు. తర్వాత సదరు అభ్యర్ధులపై ఇంటెలిజన్స్ బ్యూరో విచారించి, చంద్రబాబు ఇచ్చిన నివేదికలో వాస్తవం లేదని తేల్చిచెప్పడంతో వారు జడ్జీలుగా నియమితులయ్యారని చెప్పారు. బీసీల జపం చేసే చంద్రబాబు హైకోర్టు జడ్జీలుగా నియమితులు కాకుండా అవకాశాలను నీరు గార్చేందుకు తప్పుడు ఆరోపణలతో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు లేఖలు రాశారన్నారు. ఈ కీలక అంశాలను జస్టిస్ ఈశ్వరయ్య బయట పెట్టడంతో బాబు నిజస్వరూపం బయటపడిందని వాపోయారు. న్యాయమూర్తులు సహా అన్ని ముఖ్య రంగాల్లో బీసీలను అణగదొక్కేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని, దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టినట్టు వెంకటేశ్వరరావు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆకుల వెంకటరమణ, బోణం భాస్కర్, వరిపిల్లి సత్యనారాయణస్వామి (చిన్నస్వామి), మచ్చా అప్పాజీ, బన్ను, పెద్దాడ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.

మూడో రోజు కోనసాగిన సీటీఓ సతీమణి థర్నా

అమలాపురం, ఏప్రిల్ 25: తన భర్త తనను కాపురానికి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ అమలాపురం సీటీఓ సతీమణి యన్నం అంకమ్మ స్థానిక కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా బుధవారం మూడవ రోజుకు చేరుకుంది. స్థానిక కార్యాలయం ఎదుట ‘నాభర్త యన్నం వెంకటేశ్వర్లు (సీటీఓ, అమలాపురం) మనసు మారాలి, నన్ను కాపురానికి తీసుకు వెళ్ళాలి’ అన్న నినాదంతో కూడిన ప్లెక్సీని ప్రదర్శిస్తూ గత మూడు రోజులుగా మండుటెండలో నిలువుకాళ్ళపై నిలబడి తండ్రి నూకతోటి మాచర్లయ్య, తల్లి రమణమ్మ, సోదరుడు బాలకృష్ణతో ధర్నా చేస్తున్నారు. అయితే వెంకటేశ్వర్లు మాత్రం కనీసం ఆమె వైపు కనె్నత్తయినా చూడకపోవడం స్థానికుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా అంకమ్మ స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ తనకు న్యాయం జరిగేంతవరకూ ధర్నా కొనసాగిస్తానని, ఏదో ఓకరోజు తన భర్త మనసు మారుతుందని, ఆయన మనస్సు మారాలని కోరుకుంటున్నట్లు అంకమ్మ తెలిపింది. దీనిపై సీటీఓ వెంకటేశ్వర్లును వివరణ కోరగా తమ కేసు కోర్టులో ఉందని, న్యాయస్థానం తీర్పుకు తాను కట్టుబడి ఉంటానని తెలిపారు.