తూర్పుగోదావరి

వాల్మీకుల కుల ధ్రువీకరణ పత్రాలపై త్వరలో నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, ఏప్రిల్ 25: దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న వాల్మీకుల కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రంపచోడవరం సబ్ కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. జడ్డంగిలో ఏర్పాటు చేసిన కులధ్రువీకరణ పత్రాల మంజూరు మేళాను బుధవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించి మాట్లాడారు. 1962 నుండి నిలిచిపోయిన కుల ధ్రువీకరణ పత్రాలపై కలెక్టర్, తాను సమావేశమై సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏజెన్సీలో వందేళ్ల నుండి తాము నివాసముంటున్నామని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని, అధికారులు తమకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా కావాలనే అడ్డుకుంటున్నారని వాల్మీకి సంఘం నేత ముంగారి గణపతి సబ్‌కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసారు. ధ్రువీకరణ పత్రాలు లేక అనేక మంది నిరుద్యోగులుగా మారుతున్నారని, మరికొంత మంది మధ్యలోనే చదువుమానివేసి రోడ్డున పడుతున్నారని, అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోకపోతే చావే శరణ్యమని వాల్మీకులు ఆధారాలు సబ్‌కలెక్టర్‌కు చూపుతూ ఆవేదన వ్యక్తం చేసారు. జడ్డంగిలో 2,500మంది నివసిస్తుండగా కేవలం 400 మంది మాత్రమే కుల ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోడం పట్ల సబ్‌కలెక్టర్ విస్మయం చెందారు. ఈ ధ్రువీకరణ పత్రాల వలన 60 రకాల ప్రయోజనముందనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని, ఇకపై కుల ధ్రువీకరణ పత్రం లేని వారంటూ ఏజెన్సీలో ఉండకూడదనే ఈ మేళా ఏర్పాటు చేస్తున్నామని సబ్ కలెక్టర్ వెల్లడించారు. ప్రతీ జనవాసానికి ఒక ఇన్‌చార్జి అధికారిని నియమించి ఈ పత్రాలు మంజూరు చేయిస్తామని సబ్ కలెక్టర్ అన్నారు. అర్హులైన 40మందికి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసారు. అనంతరం లోదొడ్డి చెక్ డ్యాంకు ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ ఇంజన్‌ను పరిశీలించేందుకు సబ్‌కలెక్టర్ వెళ్లారు. కార్యక్రమంలో సర్పంచ్ కొంగర మురళీ, ఎంపీటీసీ కోపూరి నూకాలమ్మ, టీడీపీ మండల అధ్యక్షులు జి తాతారావు, వైసీపీ మండల అధ్యక్షులు ఎస్ రామకృష్ణ, తహసీల్దారు జె శ్రీనివాసు, ఎస్సై వెంకటనాగార్జున తదితరులు పాల్గొన్నారు.