తూర్పుగోదావరి

మద్దాలకే ఛైర్మన్ పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినవిల్లి, ఏప్రిల్ 26: ఎంతో ఉత్కంఠ నెలకొన్న అంబాజీపేట మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి ఎట్టకేలకు మాజీ జడ్పీటీసీ సభ్యుడు మద్దాల సుబ్రహ్మాణ్యేశ్వరావుకే దక్కింది. దీనికి సంబంధించి పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అధికారికంగా సుబ్రహ్మణ్యేశ్వరావు పేరును ప్రకటించారు. గత అయిదు నెలలుగా అంబాజీపేట ఏఎంసీ ఛైర్మన్ పదవి కోసం అయినవిల్లి మండలంలో రెండు సామాజిక వర్గాలు మధ్య పోటాపోటీగా వేడి రగులుకుంది. దీనికి సంబంధించి జిల్లాలో ఉన్న ఇద్దరు క్యాబినేట్ మంత్రులకు అంబాజీపేట మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి పెద్ద తలనొప్పిగానే తయారయ్యిందని అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఈ సమస్య పరిష్కారం కోసం పార్టీ అధిష్టానం వరకూ వెళ్లిందంటే ఎంత తీవ్రమైన పోటీ ఉందో అర్ధమవుతోంది. దీనికోసం అయినవిల్లి మండల ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూశారు. మొదటి నుండి పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి జనాకర్షణ ఉన్న వ్యక్తికే అంబాజీపేట చైర్మన్ పదవి ఇవ్వడానికి మొగ్గుచూపారు. అది చివరి వరకూ నిలబెట్టుకుని ఆయన మొగ్గుచూపిన వ్యక్తికే ఛైర్మన్ పదవిని కట్టపెట్టారు. అయితే ఎన్నో ఏళ్లుగా పార్టీలోనే ఉంటూ పార్టీకోసం పనిచేసిన పోతుకుర్రు గ్రామానికి చెందిన సయ్యపురాజు సత్తిబాబురాజు ఈసారి అంబాజీపేట మార్కెట్ యార్డు చైర్మన్ పదవికోసం చాలా కృషి చేశారు. ఎన్నడూ ఏ పదవి అతనికి దక్కకపోవడంతో ఈసారైనా ఛైర్మన్ పదవి దక్కుతుందనే ఆశతో సత్తిబాబు రాజు ఉన్నా ఆయనకు ఈ ఛైర్మన్ పదవి అందని ద్రాక్షగానే ఉండిపోయింది. గురువారం అయినవిల్లి మండలం తొత్తరమూడిలో సుబ్రహ్మణ్యేశ్వరరావు స్వగృహం వద్ద ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీలో కష్టించి పనిచేసి ప్రజలకు చేరువైన వ్యక్తులకు పదవులు దక్కుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరరావుకు ఎంపీపీ సలాది పుల్లయ్య నాయుడు, పలువురు నాయకులు, కార్యకర్తలు పూలదండలు వేసి అభినందనలు తెలిపారు.