తూర్పుగోదావరి

బీహార్ గ్యాంగ్ రూమర్లు నమ్మవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, మే 21: బీహార్ గ్యాంగ్ జిల్లాలో తిరుగుతూ చిన్నపిల్లలను ఎత్తుకు వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు. బీహార్ గ్యాంగ్ జిల్లాకు రాలేదని, జిల్లా ప్రజలు ఈవిషయాన్ని నమ్మవద్దని హితవు పలికారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రజారాన్ని, రూమర్లను నమ్మవద్దని, ప్రజలు మానసికస్థితి సక్రమంగాలేని వారిపై దాడిచేసి గాయపరచడం దురదృష్ట కరమన్నారు. మానసిక వికలాంగులను హింసించడం తగదని ప్రజలకు ఆయన విజ్ఞప్తిచేశారు. ప్రజలకు అనుమానితుల వివరాలు తెలిస్తే 100నంబర్‌కు లేదా సమీపంలో పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పిలుపునిచ్చారు. పోలసులు అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎస్పీ విశాల్ గున్ని పేర్గొన్నారు. ప్రజలు లాఅండ్ అర్డర్‌ను చేతుల్లోకి తీసుకోవద్దని హితవు పలికారు.
ఖాళీ బిందెలతో నిరసన
కోరుకొండ, మే 21: కోరుకొండ మండలంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలంటూ వైసీపీ శ్రేణులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీ మంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత కురసాల కన్నబాబు మాట్లాడుతూ పేరుకే గోదావరి జిల్లా అని, జిల్లాలో ఎక్కడ చూసినా మంచినీటి సమస్య తాండవిస్తోందన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదన్నారు. చంద్రబాబునాయుడు తన కేసుల పరిష్కారంపై చూపే శ్రద్ధ ప్రజల అవసరాలపై చూపడంలేదన్నారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ గోదావరి చెంతనే ఉన్నా తీరప్రాంత ప్రజలకు మంచినీరు దొరకడం లేదన్నారు. వాటర్ ట్యాంకుల ద్వారా గ్రామాల్లో మంచినీటి కొరత తీర్చాలన్నారు. సత్యసాయి బాబా ఆశయాల మేరకు సత్యసాయి వాటర్‌ను గ్రామాలకు నిరంతరం అందించాలన్నారు. అనంతరం మంచినీటి సమస్యను పరిష్కరించాలంటూ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అనంతబాబు, జక్కంపూడి విజయలక్ష్మి, రాజా తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో వైసీపీ మండల శాఖ అధ్యక్షుడు ఉల్లి బుజ్జిబాబు, పలువురు మహిళలు పాల్గొన్నారు.