తూర్పుగోదావరి

ఏజెన్సీ మహిళల పట్ల శాపంగా మారిన రక్తహీనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, మే 21: గిరిజన ప్రాంతంలో నివశిస్తున్న మహిళలకు పౌష్టికామాహారంలేమితో బాటు రక్తహీనత, సరైన వైద్య సహాయం అందకపోడం శాపంగా మారింది. దీనితో పండంటి బిడ్డనివ్వాల్సిన గర్బిణులు మృత శిశువులకు జన్మనివ్వడం, మాతా, శిశుమరణాలు సంభవిస్తున్నాయి. మండలంలో అప్పలరాజుపేట గ్రామానికి చెందిన గూడుపు ప్రేమజ్యోతి అనే గిరిజన మహిళ తన తొలికాన్పులో సోమవారం మృత శిశువుకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే తెల్లవారుజామున తీవ్రమైన రక్తస్రావం కావడంతో బాటు నొప్పులు రావడంతో కుటుంబీకులు ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు పురుడుపోయగా అప్పటికే మరణించిన శిశువు జన్మించింది. ప్రేమ జ్యోతి గర్బందాల్చిన తరువాత నెల నెలకు బరువు పెరగాల్సిందిపోయి తగ్గిపోడం, తల్లిబరువుతోబాటు శిశువు బరువుకూడ తగ్గిపోడం జరిగింది. కేవలం సరైన పౌష్టికాహారం ఆమెకు అందకపోడం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. తొలికాన్పులోనే ఆరోగ్యకరమైన బిడ్డను చూడాలనుకొన్న తల్లి దండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. జూలై 12 ఆమెకు పురుడు వస్తుందని వైద్యులు సూచించినా అనారోగ్యం కారణంగా ముందుగానే కాన్పు వచ్చిందని వైద్యులు తెలిపారు. ఈనెల 9న స్థానిక పీహెచ్‌సీలో ఆమెను పరీక్షించిన వైద్యులు పిండం ఎదుగుదల సక్రమంగాలేదు, కాకినాడ జనరల్ ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకొని మందులు వాడాలని సూచించారు. పేదరికం కారణంతో బాటు ప్రేమజ్యోతి బాగా నీరసంగా ఉండడంతో కుటుంబసభ్యులు వెంటనే జిహెచ్‌కు తీసుకెళ్లలేకపోయారు. రెండురోజుల్లో తీసుకెళ్లి పరీక్షలు చేయిద్దామనుకున్న తరుణంలో ఈ దుర్ఘటన జరిగిందని ప్రేమజ్యోతి తల్లి రాజామణి ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం మండలానికి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా గైనకాలజిస్టు, స్కానింగ్ తదితర యంత్రాలను అమర్చితే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని స్థానికులు వాపోతున్నారు. మన్యంలో పలు మాతా, శిశుమరణాలు సంభవిస్తున్నా సరే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోడంతో సర్వత్రా నిరసన వ్యక్త మవుతుంది.
ప్రతీ ఎకరాకు పూర్తిగా సాగునీరు
పిఠాపురం, మే 21: పిఠాపురం నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు పూర్తిగా సాగునీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ అన్నారు. సోమవారం పిఠాపురం తహసీల్దారు కార్యాలయంలో కాకినాడ ఆర్డీవో రఘుబాబు, పిఠాపురం తహసీల్దారు సుగుణ, ఇరిగేషన్ అధికారులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పురుషోత్తపట్నం ద్వారా పిఠాపురానికి ఎంతో మేలు కలిగిందన్నారు. వాటర్ ఫ్లో పెరగడంతో రైతులకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే త్వరలో ఏలేరు ఫేజ్ -2 టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలేరు ఆధునికీకరణ పనులకు ఫేజ్-1లో రూ.135 కోట్లు, ఫేజ్-2కు రూ.135 కోట్లు చొప్పన మంజూరు చేశారన్నారు. గతంలో నాయకుల్లా నీటి వ్యాపారం చేయడం టీడీపీ నాయకులకు చేత కాదని, రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో రాత్రింబవళ్లు కష్టపడుతున్నామన్నారు. సమావేశంలో నీటి సంఘాల నాయకులు పాల్గొన్నారు.