తూర్పుగోదావరి

వైభవంగా వాడపల్లి వెంకన్న చక్రస్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయపురం, ఏప్రిల్ 22: కోనసీమ తిరుపతిగా పేర్గాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామివారికి చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం భోగములు, నిత్యబలిహరణ, అనంతరం స్వామివారిని గౌతమి గోదావరికి తీసుకువెళ్లి పండితులు చక్రస్నానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇవో భాగవతుల వెంకటరమణమూర్తి, ఆలయ ఉత్సవ కమిటీ ఛైర్మన్ తోటకూర సుబ్బరాజు, ఏపుగంటి వెంకన్న, నడింపల్లి సుబ్బరాజు, రావి బుల్లెయ్య, పల్లికొండ గణేశ్వరరావు, ఎంవివి సత్యనారాయణ, ఎం సత్తిబాబు, వై రాజు, కె నర్సింహమ్మూర్తి, ఎం రాధాకృష్ణ, సాయిరాం, శివ, అర్చకులు ఆదిత్య అనంత శ్రీనివాస్, సాయికృష్ణ, శిఖాన్ నరేన్ చక్రవర్తి, రాంప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నపూర్ణ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు.
ర్యాలి కేశవ స్వామివారి చక్రస్నానం
మండలంలోని ర్యాలి జగన్మోహినీ కేశవ స్వామివారి కల్యాణోత్సవాలలో భాగంగా శుక్రవారం చక్ర స్నానాన్ని పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇవో యర్రా వెంకటేశ్వరరావు, అర్చకులు పెద్దింటి శ్రీనివాసాచార్యులు, ఖండవల్లి రామాచార్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.