తూర్పుగోదావరి

ఆక్రమణల తొలగింపు: ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, మే 24: రామచంద్రపురం పట్టణంలో న్యాయస్థానాల, తహసీల్దార్ కార్యాలయ ఎదురుగాగల రహదారి, వెనుక వైపునగల రహదారిపై ఉన్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ చిలకమర్తి శ్రీరామశర్మ గురువారం ఉదయం చేపట్టారు. ఈ ఆక్రమణల తొలగింపు అంశం ఉద్రిక్తతకు దారితీయగా, రామచంద్రపురం సబ్‌డివిజనల్ పోలీసు అధికారి పరిధిలోని సబ్ ఇన్‌స్పెక్టర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆక్రమణల తొలగింపు అంశంపై రెల్లి సామాజిక వర్గీయులు రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు అత్యంత సంయమనంతో వ్యవహరిస్తూ మొత్తమీద రాస్తారోకోను నిలుపుదల చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్ రాజశేఖర్, డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్‌లు శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడామైదాన రహదారి వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాధంశెట్టి శ్రీ్ధర్ తదితరులు, టీడీపీ కౌన్సిలర్లు వైట్ల సూర్యప్రకాశరావు, గడి గోవిందు తదితరులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సొంత స్థలం కాని సమయంలో ఆక్రమణ చేసిన భూములను అధికారులు అడిగిన సమయంలో ఇవ్వడం ధర్మమని, అవసరమైతే నిర్వాసితులకు కొన్నిరోజులపాటు ఆశ్రయం కల్పిస్తామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా తాము 60 ఏళ్లుగా ఈ ఆక్రమణల్లోనే నివసిస్తున్నామని, తమకు ఇళ్లు లేవని మొరపెట్టుకున్నారు. ఈదశలో కొందరు ఉద్రేకపూరితమైన ఉపన్యాసాలివ్వడంతో బాధిత కుటుంబాల మహిళలు పురపాలక కార్యాలయం ఎదురుగా రోడ్డెక్కారు. అటు, ఇటు వాహనాలను నిలుపుదల చేశారు. ఈసమయంలో కొంతమంది వ్యక్తులు వారిని అడ్డుకుని సంఘటనా ప్రదేశానికి తీసుకువచ్చారు. ఈవిషయంపై ఆర్డీవో రాజశేఖర్ మాట్లాడుతూ ఒకటో వార్డు కొత్తూరులో నిర్మిస్తున్న హౌస్ ఫర్ ఆల్ భవనాల కేటాయింపులో ఆక్రమిత నిర్వాసితులకు ప్రాధాన్యత కల్పిస్తామని, అర్హులైనవారికి హౌస్ ఫర్ ఆల్ పథకంలో భాగస్వాములు చేస్తామని స్పష్టంచేశారు. తాత్కాలికంగా పురపాలక యాజమాన్య ప్రాథమిక పాఠశాలలో నివసించేందుకు, రెల్లి కమ్యూనిటీ హాల్లో నివసించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈసందర్భంగా ఆర్డీవో రాజశేఖర్ నిర్వాసితులకు భోజన సదుపాయం కల్పించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించగా, ఆ మేరకు భోజన సదుపాయం కల్పించారు. ఆక్రమిత నిర్వాసితుల్లో మూడు కుటుంబాలు మినహా మిగిలిన కుటుంబాలన్నింటికీ ఇళ్లు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. రహదారి వెడల్పుచేసి ఆ రహదారి వెంబడి వాహనాల రాకపోకలకు అవకాశం కలిగించేందుకు, ప్రధాన రహదారిపై అడ్డంకులు ఏర్పడినప్పుడు ఈ రహదారిని డైవర్షన్ రహదారిగా వినియోగిస్తున్న సమయంలో ఈ మధ్యకాలంలో ఆక్రమణలు పెరిగినట్టు మున్సిపల్ ఛైర్మన్ చిలకమర్తి శ్రీరామశర్మ తెలిపారు. అయితే ఆక్రమిత ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల నుంచి పురపాలక శాఖ ఆక్రమిత పన్నును వసూలు చేయడం సాకుగా చూపి తాము పన్ను కడుతున్నామని అధికారులకు సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఆక్రమిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో ఉండేందుకు ఎవరికీ అర్హత ఉండదని ఆర్డీవో రాజశేఖర్ రూలింగ్ ఇచ్చారు. ఈసందర్భంగా కొన్ని పచ్చినిజాలు వెల్లడయ్యాయి. పురపాలక కార్యాలయం నుంచి కోర్టు ప్రాంగణానికి ముందు వైపునున్న రోడ్డులో ఆక్రమించుకున్నవారు 2వేలు నుంచి 5వేల రూపాయల వరకు అద్దెలు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. రామచంద్రపురం పట్టణానికి తహసీల్దార్ కార్యాలయాన్ని నూతనంగా నిర్మించనున్నట్టు, ఈ పాకలు ఉండటం వల్ల ప్రభుత్వ భవనాల గుర్తింపునకు విఘాతం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. చివరకు అధికారుల సూచనపై నిర్వాసితులు ఆందోళన వదిలి వెళ్లిపోవడంతో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కొనసాగింది. ఇదిలావుండగా రామచంద్రపురం పట్టణానికి చెందిన ఏఐటీయూసీ నాయకుడు ఉండవల్లి గోపాలరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్డీవో రాజశేఖర్, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తమ సమక్షంలోనే మున్సిపల్ కమిషనర్‌కు గత రాత్రి ఫోన్ చేసి 15రోజులపాటు గడువు ఇవ్వాలని స్పష్టం చేసినప్పటికీ మున్సిపల్ కమిషనర్ ఈ కార్యకలాపాలు చేపట్టారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెబుతూ ఇచ్చిన నోటీసుకు భిన్నంగా ప్రవర్తిస్తూ గడువు 24 గంటలు ముగియకుండా ప్రజాప్రతినిధుల మాట లెక్కచేయకుండా వ్యవహరించిన కమిషనర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ఏఐటీయూసీ తరపున కమ్యూనిస్టు పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రాము తదితరులు ప్రకటించారు. 60 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నారని, వారికి ఇళ్లులేవని, అటువంటిస సమయంలో నిర్వాసితులుగా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.