తూర్పుగోదావరి

825 రిజిస్ట్రేషన్ కాని ద్విచక్ర వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, మే 26: మండపేట రవాణాశాఖ కార్యాలయ పరిధిలో ఏడు మండలాలకు సంబంధించి ఇంకా 825 రిజిస్ట్రేషన్ కాని ద్విచక్ర వాహనాలు ఉన్నట్టుగా కనుగొన్నామని మోటారువెహికల్ ఇన్‌స్పెక్టర్ జి సంజీవ్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న సీఎఫ్‌ఎస్‌టీ విధానం ఈనెల 31వ తేదీతో అంతమై ఈ-ప్రగతికి వెళుతున్నందున తదనంతరం జూన్ 1వ తేదీ నుంచి 825 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదన్నారు. ఈనెల 31వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకుని నెంబరును అందుకోవాలన్నారు. వీరిలో ద్విచక్ర వాహన డీలర్లు ఇచ్చిన పేపర్లు పోగొట్టుకుంటే యూనిట్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ వాహనాలను సీజ్ చేసిన తరువాత 8వేల రూపాయల వరకు జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని, అయినప్పటికీ వాహన రిజిస్ట్రేషన్ నెంబరు ఇవ్వడం జరగదన్నారు. ఇన్స్యూరెన్స్ కట్టుకుని ఈనెల 31వ తేదీలోగా కార్యాలయాన్ని సంప్రదించాలని ఎంవీఐ జి సంజీవకుమార్ తెలిపారు.

దయనీయంగా చేనేత సహకార సంఘాల పరిస్థితి
రామచంద్రపురం, మే 26: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోగల చేనేత సహకార సంఘాల ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, విపరీత నష్టాల మూలంగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించలేని దుస్థితి ఏర్పడిందని రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు దొంతంశెట్టి విరూపాక్షం పేర్కొన్నారు. హసనబాద గ్రామంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ చేనేత సహకార వ్యవస్థ దయనీయ స్థితికి చేరిందన్నారు. ఒకవైపు జీఎస్టీ మూలంగా ప్రైవేటు రంగంలోని మాస్టర్ వీవర్ వ్యవస్థ మూతపడిందని, విపరీత నష్టాల మూలంగా చేనేత సహకార సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే యాభై సంఘాలు ఉండగా, 36 సంఘాలు నష్టాల్లో నడుస్తున్నాయన్నారు. 2017-18 నాటికి వాటి నష్టాలు 15కోట్ల రూపాయలకు చేరిందన్నారు. ఆప్కో సంస్థ గత ఏడాది కాలంగా సంఘాల నుంచి చేసిన వస్తఖ్రరీదుల బకాయి తొమ్మిది కోట్ల రూపాయల వరకు ఉందని, వాటిని సంఘాలకు చెల్లించాల్సి ఉందన్నారు. అదేవిధంగా జిల్లా సహకార బ్యాంకు మంజూరు చేసిన 15కోట్ల రూపాయల నగదు పరిమితితో సహా సంఘాల సొంత నిధులు కూడా స్తంభించిపోయాయని, తద్వారా సభ్యులకు ఉపాధి కల్పించలేకపోవడంతోపాటు నష్టాల ఊబిలో కూరుకుపోయాయన్నారు. ఈవిధానంలో రాష్ట్రం మొత్తమీద చేనేత సహకార సంఘాల నష్టాలు వంద కోట్ల రూపాయల వరకు ఉండగలవన్నారు. చేనేత పరిశ్రమ సంక్షేమానికి సహకార రంగం ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రిని విరూపాక్షం కోరారు. సబ్సిడీ రూపంలో నిధులు మంజూరుచేసి నష్టాలను భర్తీచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.