తూర్పుగోదావరి

అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 26: కాంగ్రెస్ పార్టీ అపుడే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అపుడే ఎన్నికలకు సమాయత్తమైనట్టు కన్పిస్తోంది. ఎన్నికల నేపధ్యంలో తూర్పు సెంటిమెంట్‌గా క్షేత్ర స్థాయి సమీక్షలతో పార్టీ పటిష్టతా కార్యక్రమాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ ఏపీ సారధి రఘువీరారెడ్డి రాజమహేంద్రవరంలో శనివారం నియోజకవర్గాల వారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని 19 నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గాల వారీగా రఘువీరారెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి నుంచే అభ్యర్థులను నిర్ణయించుకుంటే ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు అవకాశం వుంటుందనే ఆలోచనలతో పార్టీ ఈ ప్రక్రియ చేపట్టినట్టు తెలుస్తోంది. మోదీ నాలుగేళ్ళ పాలన వైచిత్రిని ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో పాటు పార్టీ తన వైఖరి ఏమిటనే విషయాన్ని ప్రజలకు వివరించి విశ్వాసాన్ని నిర్మించుకునేందుకు పార్టీ శ్రేణులకు రఘువీరా ఈ సమావేశంలో పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసే పరిస్థితి వుందని, రాహుల్ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టుకుని పార్టీని ముందుకు నడిపించేందుకు ఈ సమావేశంలో ఉద్భోధ చేసినట్టు తెలిసింది. ముందుగా తూర్పు గోదావరి జిల్లాలో క్షేత్ర స్థాయి సమీక్షల అనంతరం అన్ని జిల్లాల్లోనూ నేరుగా రఘువీరారెడ్డి సమీక్షా సమావేశాలను నిర్వహించే విధంగా కార్యాచరణ చేపట్టినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విశ్వాసఘాతక పార్టీ అన్నారు. ఎన్నో రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించేందుకు పూనుకుందని ఆరోపించారు. యుపీ ఎస్‌సీ స్వతంత్ర ప్రతిపత్తిని తొలగించి ఆర్‌ఎస్‌ఎస్‌తో నింపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తోన్న బీజేపీ వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజకరమైన వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు కృషి చేసిందన్నారు. బీజేపీ లోక్‌పాల్ బిల్లును అమలు చేయలేదన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం దేశానికి చాలా ప్రమాదమన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పట్ల బీజేపీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని జేడీ శీలం అన్నారు. ఈ సమావేశంలో నాయకులు జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, ఎస్‌ఎన్ రాజా, జిల్లా పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ, నులుకుర్తి వెంకటేశ్వర్లు, రాయుడు రాజవల్లి, ఆకుల రామకృష్ణ, బోడా వెంకట్, బాలేపల్లి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.