తూర్పుగోదావరి

ఆదమరిస్తే అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట, ఏప్రిల్ 24: మండపేట మండలం కేశవరం గ్రామానికి వెళ్లేదారిలో రైల్వేగేటు ఉంది. నిత్యం ఆ గేటు మీదుగా వందలాది మంది బాటసారులు, భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు వస్తూ వెళ్తుంటాయి. ఆ మార్గం గుండానే చాలా వాహనాలు రాజమండ్రి కూడా రెండవ మార్గంగా ఎంచుకుని జనం ప్రయాణాలు సాగిస్తుంటారు. అక్రమంగా ఎర్రమట్టి, మట్టి తవ్వకాలు తదితర రవాణా క్వారీ లారీల ద్వారా ఈ గేటు మార్గాన జరుగుతుంటాయి. రైల్వేగేటు వేసినా, రైలు కూత వినపడినా...ప్రయాణీకులకు ఎవరికీ వినిపించనట్టు, ఆదమరిస్తే అంతే అని తెలిసినా గేటుదాటి ప్రయాణిస్తుంటారు. ఏటా పండుగల సమయంలో ఇక్కడ గనిపోతురాజు ఉత్సవం జరుపుతుంటారు. ఎంతోమంది భక్తులు పరిసరాల నుండి గేటుదాటి ప్రయాణించాల్సి ఉంటుంది. అయినా తొందరపాటుతో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా గేటుదాటి వెళ్తుంటారు. ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మించాల్సిన బాధ్యత ప్రజాపత్రినిధులపై ఎంతైనా ఉంది. దీనిపై కసరత్తు జరుగుతోంది. ప్రతిపాదనల స్థాయిలో ఉందంటూ ప్రసంగాలకే ఈ గేటు నిర్మాణం పరిమితమవుతోంది. దీనిపై ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్షణం ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించి ప్రయాణీకులు, బాటసారుల ప్రాణాలు కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.