తూర్పుగోదావరి

27 నుంచి బ్యాడ్మింటన్ సెలక్షన్ టోర్నమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 18: జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్ టోర్నమెంట్ ఈ నెల 27, 28, 29 తేదీల్లో కాకినాడ గైగోలుపాడు జంక్షన్ కేబీఏ అకాడమీ ఇండోర్ స్టేడియంలో జరగనున్నట్టు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షురాలు కొడాలి తనూజ తెలియజేశారు. 2018 సంవత్సరానికి సంబంధించి జిల్లా బ్యాడ్మింటన్ సెలక్షన్ టోర్నమెంట్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్నట్టు రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.
ఈ నెల 27న 13-15 సంవత్సరాల్లోపు బాలబాలికలకు సింగిల్స్, డబుల్స్ పోటీలు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మొదలవుతాయని, అదే రోజు వెటరన్స్ 60-65-70 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులు మధ్యాహ్నం మూడు గంటలకు రిపోర్టు చేయాలన్నారు. 28న 17-19 సంవత్సరాల్లోపు బాల బాలికలు సింగిల్స్, డబుల్స్ రిపోర్టు చేయాలని, అదే రోజు వెటరన్స్ కూడా మధ్యాహ్నం మూడు గంటలకు రిపోర్టు చేయాల్సి వుందన్నారు. 29న మెన్, ఉమెన్ సింగిల్స్, డబుల్స్ పోటీలు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. అలాగే వెటరన్స్ 35-40-45 సంవత్సరాల పైబడిన మెన్, ఉమెన్ క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్ ఉదయం 9 గంటలకు రిపోర్టు చేయాలన్నారు. ఈ పోటీలు జిల్లా కార్యదర్శి చుండ్రు గోవిందరాజు ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. ఎంట్రీలు 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు పంపించాలని, 9441710286, 9848277745 నంబర్ల వాట్సాప్‌కు పంపించవచ్చన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు అండర్-13 బాలిబాలికలు కర్నూలు జిల్లా నంద్యాలలో ఆగస్టు 9 నుంచి 12వ వరకు జరిగే అంతర్ జిల్లాల పోటీలకు అర్హులవుతారన్నారు. అండర్-15 బాలబాలికలు ఆగస్టు 2 నుంచి 5 వరకు అనంతపురం జిల్లాలో జరిగే పోటీలకు, అండర్-17 బాలిబాలికలు జూలై 15 నుంచి 18 వరకు కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగే పోటీలకు, అండర్-19 బాలబాలికలు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు రాజమహేంద్రవరంలో జరగనున్న అంతర్ జిల్లాల పోటీలకు అర్హత పొందుతారన్నారు. మెన్, ఉమెన్ జూలై 26 నుంచి 29 వరకు విజయవాడలో జరగనున్న పోటీలకు అర్హత పొందుతారని అసోసియేషన్ అధ్యక్షురాలు కొడాలి తనూజ తెలియజేశారు. సమావేశంలో దూడల త్రినాధ్, కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం, పి రవికుమార్, బెజవాడ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ లే-అవుట్లపై కఠిన చర్యలు
*కలెక్టర్ కార్తికేయ మిశ్రా

కాకినాడ, జూన్ 18: జిల్లాలో అనుమతి లేని లే-అవుట్లు, ఇటువంటి అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా హెచ్చరించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జేసీ మల్లికార్జున తదితరులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో కలెక్టర్‌కు జిల్లాలో అక్రమ లే-అవుట్స్ అరికట్టాలని సామర్లకోట మండలం పనసపాడు శివారు గొంచర్లకు చెందిన రైతులు అక్రమ లే అవుట్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 15/2లో అక్రమ లేఅవుట్లు వేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అక్రమ లే అవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఏ ప్రాంతంలోనూ అక్రమ లే అవుట్లు, అనధికార నిర్మాణాలను సహించేది లేదని చెప్పారు. ఈ సందర్భంగా కాకినాడ 36వ డివిజన్ కార్పొరేటర్ ఎస్ లక్ష్మీప్రసన్న కలెక్టర్‌ను కలసి నగరంలో కుక్కుల బెడద నుండి ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ నగరంలో తాజాగా ఓ బాలుడు కుక్కల దాడిలో గాయపడి మరణించాడని, అనేక చోట్ల వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రంగంపేట మండలం మర్రిపూడికి చెందిన రైతు ఎం వెంకన్న తన పొలంలో వ్యవసాయ పంపుసెట్లు వేసుకునేందుకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పిఠాపురం మండలం మంగితుర్తి గ్రామానికి చెందిన కొమ్మిరెడ్డి తాతయ్య తన భార్య 2018 మే 9న మరణించిందని, ఆమె బ్యాంకు ఖాతాలో కొంత సొమ్ముందన్నారు. ఆ సొమ్ముకోసం ఫ్యామిలీ మెంబర్ సర్ట్ఫికెట్ కోసం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేయగా వీఆర్వో, ఆర్‌ఐలు 2 వేల రూపాయల లంచం అడుగుతున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. కాగా ఈ వారం ప్రజావాణికి 318 అర్జీలు అందాయి. జేసీ మల్లికార్జున, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సాగునీరందక రైతుల ఇక్కట్లు
అయినవిల్లి, జూన్ 18: రబీ సాగులో నారుమళ్ళు వేయడానికి సాగునీరందక నేదునూరు ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ ఒకటో తేదీన కాలువలకు నీరు వదిలినా ఇప్పటికీ పంట బోదెలకు నీరందలేదు. నేదునూరు నీటి సంఘంలో సుమారు కోటి రూపాయలు వరకు ఇరిగేషన్ పనులు చేపడుతున్న కారణంగా సాగునీరు ఆలస్యమైందని, మంగళవారం కాలువలకు నీరు అందిస్తామని ఇరిగేషన్ ఏఈ అప్పలరాజు తెలిపారు.

జగన్ అంగరక్షకుల అత్యుత్సాహం
డి గన్నవరం, జూన్ 18: జగన్ అన్న వస్తాడు, దశాబ్దాల సమస్యను ఏకరవు పెట్టుకుందామని గంటల తరబడి ఎదురుచూసిన కాపు జెఎసి సభ్యులపై జగన్ అంగరక్షకులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో ముగ్గురు యువకులు ప్రధాన పంటకాలువలో పడిపోయారు. కావు రిజర్వేషన్‌పై మీ అభిప్రాయాన్ని జిల్లా దాటేలోపు తెలియజేయాలని వినతిపత్రం ఇవ్వడానికి పి గన్నవరం గ్రామం బోడపాటివారి పాలెంకు చెందిన యువకులు, మహిళలు ప్రజాసంకల్ప యాత్రలో వారి గ్రామం మీదుగా వెడుతున్న జగన్‌కు ఇచ్చేందుకు వెళ్ళారు. వారికి జగన్ నుండి పలకరింపు కూడా లేకపోగా ఆయన అంగరక్షకులు అత్యుత్సాహం ప్రదర్శించి నెట్టివేయడంతో బోడపాటి మణికంఠ అనే యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు యువకులు పక్కనే ఉన్న పంటకాలువలో పడిపోయారు. స్థానికులు స్పందించి కాలువలో కొట్టుకుపోత్ను ఇద్దరినీ ఒడ్డుకు చేర్చారు. అదేవిధంగా మహిళలు అని చూడకుండా నెట్టివేయడంతో వారు రోడ్డుపై పడిపోయారు. ఇంత జరిగినా జగన్ నుండి స్పందన కరవైందని గ్రామస్తులు ఆవేద వ్యక్తం చేసారు.