తూర్పుగోదావరి

డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల నివారణకు బ్రీత్ ఎనలైజర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 19: జిల్లాలో తాగి వాహనం నడిపే వారినుండి ప్రమాదాల నివారణకు రవాణా శాఖకు 11, పోలీసు శాఖకు 32 బ్రీత్ ఎనలైజర్లను సమకూర్చామని జెసి ఎ మల్లికార్జున తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో రహదారి భద్రత కమిటీ సమావేశం జెసి మల్లికార్జున అధ్యక్షతన జరిగింది. సమావేశంలో గత జనవరి నుండి మే నెల వరకు జిల్లాలో సంభవించిన రహదారి ప్రమాదాలు, మరణాలను, వాటికి కారణమైన అంశాలను విశే్లషించి నివారణకు చేపట్టాల్సిన చర్యలు సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మల్లికార్జున మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే ఈ సారి జనవరి నుండి మే నెల వరకు గల ఐదు నెలల్లో రహదారి ప్రమాదాలు 18 శాతం తగ్గినప్పటికీ దురదృష్టవశాత్తూ మరణాలు, గాయాల పాలైన వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. 2017 జనవరి నుండి మే మధ్య జరిగిన 233 రోడ్డు ప్రమాదాల్లో 77 మంది మృతులు, 245 మంది క్షతగాత్రులు నమోదుకాగా అదే కాలంలో 2018లో 81 మంది మృతులు, 240 క్షతగాత్రులైనట్లు చెప్పారు. ప్రమాదాల నివారణకు అన్ని చోట్ల తగు చర్యలు చేపట్టాలన్నారు. చట్టాన్ని అతిక్రమించిన వాహనాల నుండి రవాణ శాఖ 12 కోట్ల 53 లక్షలు, పోలీసు శాఖ 3కోట్ల 5 లక్షలను అపరాధ రుసుమును వసూలు చేశాయన్నారు. ఈ సమావేశంలో రామమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ, రాజమహేంద్రవరం మున్సిపల్ కమీషనర్ సుమీత్‌కుమార్, డిటిసి సిరి ఆనంద్, పోలీస్ అధికారులు వైవి రమణకుమార్, కె సత్యనారాయణ, మురళీమోహన్, సమాచార శాఖ డిడి ఎం ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళన
*12 నెలల కాంట్రాక్టుకై డిమాండ్ *జేఎన్‌టియూకే రిజిస్ట్రార్ ఛాంబర్లో బైఠాయింపు

కాకినాడ, జూన్ 19: జేఎన్‌టియూకేలోని వివిధ క్యాంపస్ సెంటర్లలో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న లెక్చరర్లు మంగళవారం వర్సిటీలో ఆందోళన చేపట్టారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఛాంబర్‌లోకి నేరుగా లెక్చరర్లు వెళ్ళి బైఠాయించారు. కాకినాడ జేఎన్‌టియూ పరిధిలో జేఎన్‌టియూ ఇంజినీరింగ్ కాలేజీ, విజయనగరం, గుంటూరు జిల్లా నరసరావుపేట క్యాంపస్ సెంటర్లలో సుమారు 200 మంది కాంట్రాక్టు విధానంలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. ఏటా వీరి కాంట్రాక్టును పునరుద్ధరిస్తున్నారు. తాజాగా వర్సిటీ యాజమాన్యం 11 నెలల కాల పరిమితికి లెక్చరర్లకు కాంట్రాక్టు ఇచ్చింది. అయితే గతేడాది 12 నెలల కాల పరిమితికి కాంట్రాక్టు అగ్రిమెంట్ ఇవ్వగా ఈ సంవత్సరం 11 నెలల కాల పరిమితికే ఇవ్వడాన్ని లెక్చరర్లు వ్యతిరేకించారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వర్సిటీ అధికారులను ఆశ్రయించేందుకు వచ్చారు. రిజిస్ట్రార్ ఆచార్య సుబ్బారావు ఛాంబర్లోకి వెళ్ళి బైఠాయించారు. గతేడాది మాదిరిగా 12 నెలల కాల పరిమితికి కాంట్రాక్టు అగ్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్సిటీ అభ్యున్నతికి ఎంతో కాలంగా కృషిచేస్తూ, విద్యాబోధన చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పట్ల అలసత్వం తగదని స్పష్టం చేశారు. ఇదిలావుండగా రిజిస్ట్రార్ ఆచార్య సుబ్బారావును ఈ విషయమై ఆంధ్రభూమి ప్రతినిధి వివరణ కోరగా నిబంధనల ప్రకారమే కాంట్రాక్టు లెక్చరర్లకు 11 నెలల కాంట్రాక్టు ఇచ్చినట్టు చెప్పారు. విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ల అనుమతి మేరకే ఈ విధంగా కాంట్రాక్టు ఇచ్చినట్టు తెలిపారు. గతేడాది 12 నెలలకు ఇచ్చి, ఈ ఏడాది 11 నెలలకు కాంట్రాక్టు ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు ప్రస్తుత సంవత్సరం నిబంధనలను అనుసరించి ముందుకు వెళ్తున్నామని ఆచార్య సుబ్బారావు వ్యాఖ్యానించారు.