తూర్పుగోదావరి

వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 21: వరద సహాయక చర్యలపై యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సబ్‌కలెక్టర్ సిఎం సాయికాంత్‌వర్మ సూచించారు. గురువారం తన కార్యాలయంలో వరద సహాయక చర్యలపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరదలు వచ్చిన తరువాత కాకుండా ముందస్తుగానే యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సహాయక చర్యలకు సిద్ధం కావాలన్నారు. డివిజన్, మండల స్థాయి కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన బోట్లను, గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అలాగే ఇసుక, ఖాళీ సంచులను సిద్ధం చేయాలన్నారు. హాట్‌లైట్ టెలిఫోన్ కనెక్షన్‌ను సిద్ధం చేయాలని బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు సబ్‌కలెక్టర్‌కు సూచించారు. రోడ్ల అనుసంధానం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యలు చేపట్టే ఎన్జీఓల జాబితాను తయారుచేయాలన్నారు. బలహీనంగా ఉన్న గోదావరిగట్లను పటిష్టం చేయాలని ఆదేశించారు. అంటురోగాలు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. డిఎస్పీలు ఎ శ్రీనివాసరావు, టి కులశేఖర్, డిప్యుటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ కోమలి, ఇరిగేషన్ డిఇ ఎస్ సుబ్బారావు, మున్సిపల్ ఇఇ కె పాండురంగారావు, ఆర్టీసీ డిఎం టి పెద్దిరాజు, పబ్లిక్‌హెల్త్ ఇఇ టి సత్యనారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

నగరంలో తెలంగాణా ప్రతిపక్ష నేత జానారెడ్డి
రాజమహేంద్రవరం, జూన్ 21: తెలంగాణా ప్రతిపక్ష నేత జానారెడ్డి గురువారం రాజమహేంద్రవరం నగరంలో జరిగిన ఒక శుభకార్యంలో పాల్గొన్నారు. అలాగే స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో వారి వద్ద పనిచేసిన ఒక అధికారి కుమారుడి నిశ్చితార్థం స్థానిక కళ్యాణమండపంలో జరిగింది. ఈకార్యక్రమానికి జానారెడ్డి, కోడెల, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పాల్గొని, కొత్త జంటను ఆశీర్వదించారు.