తూర్పుగోదావరి

మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంకు నుండి పడి వ్యక్తికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 21: అమలాపురం రూరల్ మండలం పేరూరులో మంచినీటి ట్యాంకుపై నుండి పడి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా మరో వ్యక్తిని ఫైర్ సిబ్బంది కాపాడి సురక్షితంగా కిందకు దించారు. ఈ సంఘటన గురువారం ఉదయం పేరూరులో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గురువారం గ్రామంలో గల మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంకుని శుభ్రం చేసేందుకు ముగ్గురు ఆర్‌డబ్ల్యుఎస్ కార్మికులు ట్యాంకు పైకి ఎక్కారు. ట్యాంకును శుభ్రం చేసిన అనంతరం ఆర్ బాలయ్య అనే కార్మికుడు సురక్షితంగా కిందకు దిగగా మరో కార్మికుడు కారెం వెంకన్నదొర దిగుతున్న సమయంలో ఇనుప నిచ్చెన విరిగిపోయి కింద పడటంతో వెంకన్నదొర కాలు విరిగడంతో పాటు తీవ్రంగా గాయపడ్డాడు. మూడో కార్మికుడు రొక్కాల నాగభూషణం సుమారు 150 అడుగుల ఎత్తున గల ట్యాంకుపై ఉండిపోయి తీవ్ర ఉత్కంఠకు లోనయ్యాడు. దీంతో ఈ సమాచారాన్ని పంచాయతీ సర్పంచ్ పెచ్చెట్టి చంద్రవౌళి అమలాపురం ఫైర్ సిబ్బందికి అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాధికారి వైవీ జానకిరామ్ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకుపై చిక్కుకున్న నాగభూషణాన్ని భారీ నిచ్చెన సహాయంతో చాకచక్యంగా కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వెంకన్నదొర, నాగభూషణంలకు స్థానిక పేరూరు పీహెచ్‌సీ సిబ్బంది ప్రాథమిక వైద్యసేవలు అందించి అమలాపురంలోని వేర్వేరు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ట్యాంకుపై చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా కిందకు దించిన ఫైర్ సిబ్బందిని స్థానిక సర్పంచ్ చంద్రవౌళితో పాటు గ్రామస్థులు అభినందించారు.

మన్యంలో భారీ వర్షం
*విద్యుత్ సరఫరాకు అంతరాయం
రాజవొమ్మంగి, జూన్ 21: ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలం జడ్డంగి పరిసర ప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండతో పాటు గాలి వేయకపోడంతో మన్యం వాసులు అల్లాడిపోయారు. ఒక్కసారిగా కారుమబ్బులు కమ్మి, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అరగంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. చల్లగాలులు వీయడంతో మన్యం వాసులు సేదతీరారు. కాగా రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ట్రాన్స్‌కో అధికారులు ముందుజాగ్రత్తగా మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు మండలంలో అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

మారుమూల గ్రామాల్లో నాణ్యమైన వైద్యం
రాజవొమ్మంగి, జూన్ 21: గిరిజన పల్లెల్లో నిరుపేదలకు నాణ్యమైన వైద్య సహాయం అందించాలనే ధ్యేయంతో మండలంలో ఏర్పాటుచేసిన గిరి ఆరోగ్య కేంద్రాలు (టెలీ మెడిసిన్ కేంద్రాలు) గురువారం ప్రారంభమయ్యాయి. మండలంలో వాతంగి, అమ్మిరేకుల, చికిలింత ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలీ మెడిసిన్ కేంద్రాలను ప్రారంభించారు. అమ్మిరేకుల గ్రామంలో ఆరోగ్య కేంద్రాన్ని వైద్యాధికారి వంశీ పరిశీలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనుని వ్యాధి వివరాలు ఫైబర్ గ్రిడ్ సహాయంతో యాప్ ద్వారా విశాఖ, విజయవాడలలో ఉన్న ప్రధాన వైద్య సహాయ కేంద్రాలకు చేరవేస్తారు. ఈ కేంద్రాల్లో ఉన్న నిపుణులు ఆ రోగులకు ఎటువంటి మందులు అందజేయాలో తెలియజేస్తారు. టెలీ మెడిసిన్ కేంద్రంలో ఉన్న ఎఎన్‌ఎంలు ఆ రోగికి ఉచితంగా అక్కడ స్టోర్‌లో ఉన్న మందులను అందజేస్తారు. మన్యంలో రోజురోజుకీ పెరిగిపోతున్న మాతా, శిశుమరణాలు అరికట్టేందుకు ఈ వైద్యం దోహదపడుతుందని డా. వంశీ అభిప్రాయపడ్డారు. వాతంగి ఆరోగ్య కేంద్రాన్ని గృహనిర్మాణ శాఖ డిఇ సూరిబాబు పరిశీలించి ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని గిరిజనులను కోరారు. రాష్టవ్య్రాప్తంగా ఏర్పాటు చేసిన 40 కేంద్రాలను విశాఖ నుండి సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ఇచ్చిన సందేశాన్ని టివి ద్వారా గిరిజనులు ఆసక్తిగా ఆలకించారు.