తూర్పుగోదావరి

తుపాన్లపై ముందుజాగ్రత్త చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 23: జిల్లాలో జూలై నుండి అక్టోబరు మధ్య కాలంలో తుపాన్లు, వరదలు సంభవించే అవకాశం ఉందని, విపత్తులను ఎదుర్కొనేందుకు వివిధ శాఖల అధికారులు ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని కలెక్టరేట్‌లో గల విధాన గౌతమీ హాలులో శనివారం తుపాన్లపై ముందస్తు చర్యలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తుపాన్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు సేవలందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుని అమలుచేయడం ద్వారా వరద ప్రభావాన్ని అరికట్టవచ్చన్నారు. వాతావరణ శాఖ, గోదావరి రివర్ కంజర్వేటర్లు ఇచ్చే హెచ్చరికలను పరిగణలోకి తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాలోని తీర ప్రాంతంలో గల తుపాను రక్షిత కేంద్రాలను పరిశీలించి, వాటి పరిస్థితిని వివరించాలన్నారు. తుపాను రక్షిత కేంద్రాల మరమ్మత్తులకు అవసరమైన నిధులను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. తుపాను ప్రభావానికి గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ముందస్తు చర్యలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో సహాయ కార్యక్రమాల కోసం మండల స్థాయిల్లో తహశీల్దార్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. బలహీనమైన ఏటిగట్లను గుర్తించి, యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలన్నారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వరద ముంపు ప్రాంతాలకు ఆహార పదార్థాలందించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యశాఖ, విద్యుత్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య శాఖలు అత్యంత బాధ్యతాయుతంగా పని చేయాలని పిలుపునిచ్చారు. వరదలొచ్చే సమయంలో జిల్లాలో నూతనంగా విలీనమైన ఎటపాక డివిజన్లోని 4 మండలాల్లో నీటి ప్రవాహం అధికంగా ఉంటుందని, ఈ సమస్య పరిష్కారానికి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 420కిలోమీటర్ల నిడివిలో వున్న గోదావరి గట్టు పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఏ మల్లిఖార్జున, రంపచోడవరం ఐటీడిఏ పీవో నిషాంత్‌కుమార్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ సుమిత్‌కుమార్ గాంధీ, ఎటపాక ఐటీడీఏ పివో అభిషిక్త్‌కిశోర్, రాజమహేంద్రవరం, రంపచోడవరం సబ్ కలెక్టర్లు సాయికాంత్ వర్మ, వినోద్‌కుమార్, జిల్లా అటవీ శాఖాధికారి నందినీ సలారియా, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి, కాకినాడ మున్సిపల్ కమిషనర్ శివపార్వతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.