తూర్పుగోదావరి

ఆచూకీ దొరికేవరకు గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూలై 16: ఐ పోలవరం మండలం పశువుల్లంక పడవ ప్రమాదంలో గల్లంతయిన వారందరి ఆచూకీ లభించేంత వరకూ గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. సోమవారం యానాం బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన బేస్ క్యాంపునకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్నీలతో కలిసి గాలింపు చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ గల్లంతయిన వారిని వెతికేందుకు మొత్తం 22 టీంలు ఏర్పాటు చేశామన్నారు. వారిలో 19 బృందాలు గోదావరి నదికి ఇరువైపులా గాలింపు చేపట్టగా ఒక బృందం హెలికాప్టర్‌లో గాలిస్తుందన్నారు. గల్లంతయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశామన్నారు. సోమవారం వాతావరణం అనుకూలించడంతో గాలింపు చర్యలను వేగవంతం చేశామన్నారు. ల్రంక గ్రామాలు చేరేందుకు నదీ ప్రాంతాల్లో ఫంటులు ఏర్పాటుకు చర్యలు తీసుకుని లైసెన్సులు ఇప్పిస్తామని మంత్రి తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న పంటులు మరమ్మతులు చేయిస్తున్నామన్నారు. సలాదివారిపాలెం గ్రామస్థులు పంటు అడిగారని, సోమవారం సాయంత్రానికి పంటు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే పశువుల్లంక రేవు వద్ద సోమవారం సాయంత్రానికల్లా 50 లైఫ్ జాకెట్లు పడవలో అందుబాటులో ఉంచామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గల్లంతైన వారి ఆచూకీ కోసం ఎటువంటి సహాయ సహకారులు అందించడానికైనా సిద్ధంగా ఉన్నారన్నారు. పడవలలో ప్రయాణం సాగించే ప్రయాణీకులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని, అలాగే పశువుల్లంక వద్ద అందిస్తున్న లైఫ్ జాకెట్లు వినియోగం విజయవంతమైతే మిగిలిన రేవుల వద్ద కూడా అందిస్తామని మంత్రి తెలిపారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ పడవ ప్రమాదంలో గల్లంతైన కుటుంబాల వారికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించేందుకు తనతో పాటు చినరాజప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్య మంత్రి మానవతా దృక్పథంతో గల్లంతైన వారి అందరి కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం అందించేందుకు సహకరిస్తారని రాజకుమారి తెలిపారు. పశువుల్లంక వద్ద జరిగిన ప్రమాదం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించిన వనం - మనం కార్యక్రమంలో పిల్లలను వినియోగించుకున్నామనేది అవాస్తవమని, పిల్లల్లో నైతిక విలువలు, సామాజిక భద్రత పెంచవల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మంత్రి రాజప్ప ఛైర్‌పర్సన్ రాజకుమారి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్‌పీ విశాల్ గున్ని, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబులు పడవలో పర్యటించి విద్యార్థుల ఆచూకీ కోసం కొంతసేపు వెతికారు. వారి వెంట ఏపీఎస్‌పీ కమాండెంట్ జే కోటేశ్వరరావు, అమలాపురం, రామచంద్రపురం ఆర్డీవోలు బీ వెంకటరమణ, రాజశేఖర్ తదితరులున్నారు.

అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు
*ఎమ్మెల్యే తోట
రామచంద్రపురం, జూలై 16: ప్రజల సంక్షేమానికి, ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన పనులు సకాలంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినప్పటికీ నీటిపారుదల శాఖాధికారులు అడ్డంకులు కల్పిస్తున్నారని, ఈ విషయంలో తాను అధికారులపై కఠిన చర్యలు తీసుకోగలనని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు హెచ్చరించారు. సోమవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఇరిగేషన్ అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో ఎస్సీలు నివసించే తన నియోజకవర్గ పరిధిలోని కె గంగవరం మండలానికి చెందిన శేరులంక గ్రామంలో గోదావరి నది వద్ద గ్రోయిన్ల నిర్మాణానికి రూ.16 కోట్ల నిధులు మంజూరయ్యాయని, పనులు నిర్వహించకుండా 18 నెలలుగా ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. జొన్నాడ నుండి యానాం వరకు గౌతమీ నది, గోదావరి గట్టు రూ.175 కోట్లతో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తూ జివోలు ఇచ్చారని, అధికారులు ఈ పనుల విషయంలో ముందుకు వెళ్లకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. జీవోలు నిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో తనను ఇబ్బందుల పాలు చేస్తున్నార్నారు. శేరులంక గ్రామానికి వెళ్లిన సమయంలో ఆ గ్రామస్థులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేని దుస్థితి ఏర్పడిందని, దీనికి కారణం ఇరిగేషన్ అధికారుల నిర్వాకమేనన్నారు. జొన్నాడ - యానాం రహదారి అభివృద్ధి జరిగితే ఆహ్లాదకరమైన వాతావరణంలో అతితక్కువ సమయంలో యానాం నుండి రావులపాలెంకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఎన్‌హెచ్‌కి అనుసంధానంగా ఏటిగట్టు రహదారి ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ పనులు చేస్తారా, లేదా ఇతర ప్రజాప్రతినిధులు చేస్తారా, అధికారులే కదా చేయాల్సింది, అధికారుల వైఖరి వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఇరిగేషన్ అధికారులు అమలు చేయకపోతే అమరావతిలోని సచివాలయం వద్ద ఆ జీవోలను బోగిమంట వేసి తగలబెడతానని తీవ్రంగా ఎమ్మెల్యే తోట పేర్కొన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం, అధికారులు బాధపడినా తనకేమీ ఇబ్బంది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వెంటనే పనులు చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటానని ఎమ్మెల్యే తోట హెచ్చరించారు.