తూర్పుగోదావరి

వరద పరిస్థితిపై అప్రమత్తంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డతీగల, జూలై 20: అధిక వర్షాల వలన తలెత్తే వరద పరిస్థితిపై రెవిన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం సబ్‌కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన పింజరికొండ జలపాతం వద్ద పెద్దేరు(ఏలేరు)వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల పర్యాటకులను అనుమతించవద్దన్నారు. వాగుకి అవతలివైపు ఉన్న పింజరికొండ గ్రామస్తులు వాగు ఉద్ధృతి దృష్ట్యా రాకపోకలు సాగించవద్దని సూచించారు. ఇక్కడ నిర్మిస్తున్న చిన్నతరహా జలవిద్యుత్ కేంద్రం వద్ద వెంటనే సైరన్ ఏర్పాటు చేయాలన్నారు. వాగులోని నీటిని మళ్ళించడానికి వాగుకి అడ్డుగోడ నిర్మించిన నేపథ్యంలో నీటి ప్రవాహం అధికమైనప్పుడు గేటుని ఎత్తడం వల్ల ఒక్కసారిగా దిగువకు అధికంగా నీరు విడుదల అవుతుందన్నారు. సైరన్ పెట్టడం వల్ల దిగువ ప్రాంతాల వారికి సమాచారం అందుతుందన్నారు. మద్దిగడ్డ జలాశయం నీటిని దిగువకు విడుదల చేసేటప్పుడు తగిన సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతిరోజు రాత్రి 7 గంటల తర్వాత మాత్రమే నీటి విడుదల చేయాలన్నారు. వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆయా పరీవాహక ప్రాంత ప్రజలు వాగుల్లో నుంచి ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగించవద్దన్నారు. ఇన్‌ఛార్జి తహసీల్ధార్ శ్రీనివాస్, ఎఎస్‌ఐ రమణ, మద్దిగెడ్డ జలాశయం వర్క్‌ఇన్‌స్పెక్టర్ గురవయ్య, ఇతర రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే నగర దర్శిని
సామర్లకోట, జూలై 20: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు నగర దర్శిని కార్యక్రమం రూపొందించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శుక్రవారం సామర్లకోట పట్టణంలోని 8వ వార్డులో నిర్వహించిన నగరదర్శిని కార్యక్రమంలో మంత్రి రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పాత తహసీల్దారు కార్యాలయం నుండి పాదయాత్రగా 8వ వార్డులో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజప్ప అయా సమస్యలను పరిష్కరించాలని హుటాహుటిన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్దానిక వేణుగోపాల వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంత్రి రాజప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ (చిన్ని), పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కౌన్సిలర్ గోపి దుర్గ్భావాసని తదితరులు పాల్గొన్నారు.