తూర్పుగోదావరి

మెట్ట రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోకవరం, ఏప్రిల్ 26: మెట్టప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలోని పెద్దపాత్రుని చెరువు వద్ద మాజీ ఎంపిపి జనపరెడ్డి సుబ్బారావు (బాబు) ఆధ్వర్యంలో రైతులతో నిర్వహించిన ప్రత్యేక సదస్సుకు ఎమ్మెల్యే నెహ్రూ, జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే జ్యోతులతో కలిసి చెరువుల అభివృద్ధికి సంబంధించి మ్యాప్‌ను కలెక్టర్ అరుణ్‌కుమార్ పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని అధికార్లకు ఆదేశాలు జారీ చేశారు. ముసురుమిల్లి, సూరంపాలెం ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటి వల్ల ఇక్కడి ప్రాంత రైతులకు ఉపయోగం లేదని, పలువురు రైతులు జ్యోతుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన నెహ్రూ మాట్లాడుతూ ఈ సమస్య అధికార్ల వల్ల అయ్యేదికాదని, సిఎం చంద్రబాబు వచ్చినప్పడు అర్ధమయ్యే రీతిలో చక్కగా సమస్యను వివరిస్తే రైతులందరికీ మేలు కలుగుతుందన్నారు.
బురద కాలువ పనులపై నిలదీసిన కలెక్టరు
వర్షాకాలం వచ్చిందంటే గ్రామాలు మునిగిపోవడానికి కారణమైన బురద కాలువ పనులపై సంబంధిత అధికార్లను కలెక్టర్ అరుణ్‌కుమార్ నిలదీశారు. రైతు సదస్సుకు హాజరైన కలెక్టర్ కోరుకొండ-సీతానగరం మండలాల మధ్య బురద కాలువ వల్ల అనేక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, కాలువ పనులు తక్షణం చేపట్టాలని చెప్పినా ఎందుకు ఇంతవరకు మొదలు కాలేదని అధికార్లను నిలదీశారు. దీనితో సంబంధిత అధికార్లు మాట్లాడుతూ త్వరలోనే బురదకాలువ పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ హరిబాబు, ఎస్‌ఇ సుగుణాకర్, ఇఇ రాజాబాబు, డిఇ రాజాబాబు, జెఇ శ్రీనివాస్, వీరరాఘవులు, తహసీల్దారు కె సురేష్‌బాబు, ఎంపిడిఒ కె రత్నకుమారి పాల్గొన్నారు