తూర్పుగోదావరి

తగ్గిన కొబ్బరి ధరతో రైతుల్లో కలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినవిల్లి, ఏప్రిల్ 28: కోనసీమలో ప్రధాన పంట అయిన కొబ్బరి ధర ఒక్కసారిగా తగ్గడంతో కొబ్బరి రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల క్రితం కొబ్బరి కాయ ధర రూ. 6 నుండి రూ.8 ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే గత వారం రోజుల నుండి కొబ్బరి కాయ ధర రూ.3కు పడిపోవడంతో కొబ్బరి కాయలు రాశులుగా పోసి నిల్వ ఉంచామని పలువురు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న కొబ్బరి ధరలో రూ.1 దింపు కార్మికులకు, కూలీలకు ఖర్చవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రటించినట్టే కొబ్బరికి కూడా మద్దతు ధర ప్రకటించాలని, లేని పక్షంలో కోనసీమలో కొబ్బరి కనుమరుగువుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మార్కెట్ యార్డుల్లో నాఫెడ్‌ల ద్వారా కురిడి కొబ్బరి కొనుగోలు చేసేవారని, దీని ద్వారా రైతులకు లాభసాటి ఉండేదని, గత నాలుగేళ్ళుగా నాఫెడ్‌లు ద్వారా కొబ్బరి కొనుగోళ్లు నిలుపుదల చేశారని రైతులు పేర్కొంటున్నారు. గత వారం రోజుల నుండి రైతులు కొబ్బరి తోటల్లో తీసిన దింపులు ఎక్కడికక్కడే గుట్టలుగా పోస్తున్నారని, దీని ద్వారా రైతులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు గుబులు చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొబ్బరి ధర పెంచాలని పలువురు రైతులు కోరుతున్నారు.