తూర్పుగోదావరి

పర్వత కుటుంబానికి సముచిత స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, ఏప్రిల్ 28: తెలుగుదేశంపార్టీలో పర్వత చిట్టిబాబు కుటుంబానికి సముచిత స్థానం ఎప్పుడూ ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రౌతులపూడిలో అభివృద్ధి కార్యక్రమాల్లో గురువారం పాల్గొనేందుకు వెళుతూ మార్గమధ్యంలో మండల కేంద్రం శంఖవరంలో గల పర్వత రాజబాబు గృహానికి హోంమంత్రి చినరాజప్ప, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, డిసిసిబి ఛైర్మన్ వరుపుల రాజా, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి తేనేటి విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్వత రాజబాబు వారిని సాదరంగా ఆహ్వానించారు. విందు అనంతరం మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపిపి బద్ధి మణి రామారావు, వైస్ ఎంపిపి బొమ్మిడి సత్తిబాబు, ఎంపిటిసిలు పగడాల బాబ్జి, బైరా రాంబాబు, టిడిపి అధికార ప్రతినిధి పర్వత సురేష్, పిహెచ్‌సి ఛైర్మన్ పడాల దొంగబాబు పాల్గొన్నారు.