తూర్పుగోదావరి

నేడు ఎంసెట్:ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 28: అమలాపురంలో శుక్రవారం జరగనున్న ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు రీజినల్ కో-ఆర్డినేటర్ పెచ్చెట్టి కృష్ణకిషోర్ ఆంధ్రభూమికి తెలిపారు. పరీక్షల కోసం కోనసీమలో నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ పరీక్షా కేంద్రాల్లో 3,126 మంది ఇంజనీరింగ్, 933 మంది మెడిసిన్ పరీక్ష రాయనున్నారన్నారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకూ ఉంటుందన్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను చూపితే చాలన్నారు. కోనసీమలో అమలాపురం ఎస్‌కెబిఆర్ కళాశాల, భట్లపాలెం బివిసి ఇంజనీరింగ్ కళాశాల, ముమ్మిడివరం మండలం అనాతవరం ప్రసిద్ధ ఇంజనీరింగ్ కళాశాల, కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని కృష్ణకిషోర్ తెలిపారు. అయితే కొంతమంది దూరప్రాంత విద్యార్థులకు చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల చిరునామాపై కొంత గందరగోళం ఉందని, ఆ కళాశాల అమలాపురం-కాకినాడ మార్గంలో 216 జాతీయ రహదారి పక్కనే ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు సమీపంలో ఉందని, ఈ విషయాన్ని గమనించాలని కృష్ణకిషోర్ విజ్ఞప్తి చేశారు. కాగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, వారి సహాయకులు సేద తీరడం కోసం ఆయా కళాశాలల వద్ద భారీ టెంట్లు ఏర్పాటు చేశారు. అక్కడే విద్యార్థులు, వారి సహాయకులకు అవసరమైన మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు వంటి అల్పహారాన్ని ఉచితంగా అందించే ఏర్పాట్లు కళాశాలల యాజమాన్యాలు చేశాయి.