తూర్పుగోదావరి

తాగునీటిలో ఫ్లోరైడ్, ఐరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 28: జిల్లాలో ఏటికేడాది వేసవిలో దాహార్తి పెరుగుతోంది. నీటిమట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో పలుచోట్ల నీటిలో ఐరన్ శాతం పెరుగుతోంది. ఇప్పటికే విలీన మండలాల్లో మూడుచోట్ల ఫ్లోరైడ్ గుర్తించడంతో ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రత్యేక మంచినీటి పథకాలను రూపొందిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోను, మెట్టప్రాంతంలోని కొన్ని చోట్ల మంచినీటిలో ఐరన్ శాతం పెరుగుతున్నట్టు గుర్తించారు. మంచినీటి ఆవాసిత ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గిపోవడంతో ఏటికేడాది నీటిమట్టాలు పడిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి ఎగువ ప్రాంతంలో ఐరన్ శాతం అధికంగా పెరుగుతున్నట్టు గుర్తించారు. రాజమహేంద్రవరం, రామచంద్రపురం, రంపచోడవరం డివిజన్లతోపాటు ఎటపాక డివిజన్‌లోని చింతూరు, మెల్లిపాక, విఆర్ పురం, కూనవరంలో మంచినీటి పథకాలకు వేసవి దాహార్తిని తీర్చేందుకు కాలువల మూసివేతకు ముందే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపారు. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో రూ.10.50 కోట్లతో బోర్‌వెల్స్ నిర్వహణకు నిధులను పంచాయతీలకు అప్పగించారు. జిల్లాలో 7 వేల వరకు మంచినీటి బోర్‌వెల్స్ ఉన్నాయి. అదేవిధంగా 79 ఆర్వో ప్లాంట్ల ద్వారా మంచినీటిని అందిస్తున్నారు. ఏజెన్సీలో 107 సోలార్ పంపుసెట్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తం బోర్ వెల్స్‌లో ప్రస్తుతానికి 428 పనిచేయడం లేదని గుర్తించారు. మంచినీటి పథకాలను విస్తరించి, అభివృద్ధి చేసేందుకు నియోజకవర్గానికి రూ.15 లక్షలతో ప్రతిపాదనలు పంపించారు. పట్టణాలు, నగరాల్లో తలసరి నీటి వాడకం 140 లీటర్లు నిర్దేశించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ తాగునీటి పథకం నిబంధనల ప్రకారం తలసరి 55 లీటర్లు చొప్పున నీటి సరఫరా చేయాల్సి ఉంది. ఈవిధంగా జిల్లాలో 1092 గ్రామాలకు తలసరి 55 లీటర్ల మంచినీటి సరఫరా చేస్తున్నారు. 10 లీటర్ల చొప్పున 239 గ్రామాలు, 20 లీటర్లు చొప్పున 468 గ్రామాలు, 30 లీటర్లు చొప్పున 615 గ్రామాలు, 40 లీటర్లు చొప్పున 713 గ్రామాలకు తలసరిగా నీటి సరఫరా జరుగుతోంది. జిల్లాలో గణాంక వివరాలను బట్టి చూస్తుంటే ఏటికేడాది భూగర్భ జలాల మట్టం పడిపోతుండటంతో ప్రధానంగా ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో ఐరన్ శాతం పెరుగుతోంది. మారేడుమిల్లి ప్రాంతంలోని పాములేరు పంచాయతీలోను, దేవీపట్నం ఎగువ ప్రాంతంలోను ఐరన్ శాతం విపరీతంగా పెరుగుతున్నట్టు గుర్తించారు. ఇప్పటికే విలీన మండలాల్లో మూడు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ గుర్తించడంతో ప్రపంచ బ్యాంకు నిధులతో మంచినీటి పథకాలను నిర్మిస్తున్నారు. ఇందులో విఆర్ పురం మండలం రేఖపల్లిలో రూ.8 లక్షల నిధులతో రూపొందించిన మంచినీటి పథకం పూర్తయింది. చింతూరు మండలం పెగ గ్రామం వద్ద వినాయకపురంలో రూ.12 లక్షలతోను, చింతూరు మండలం ఎజి కోడూరు మల్లితోట గ్రామం వద్ద రూ.14 లక్షలతోను మంచినీటి పథకాలు రూపొందుతున్నాయి. మారేడుమిల్లి, వై రామవరం మండలాల్లో 10 గ్రావిటీ పథకాలను రూపొందించి, తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పథకాల్లో వాగుల నీటికి అడ్డుకట్ట వేసి, వడిసి పట్టుకుని పైపుల్లోకి సమీకరించి, ఫిల్టర్‌చేసి గిరిజన తండాలకు తాగునీటిని అందించేందుకు ఈ పది పథకాలను రూపొందించినట్టు ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ లక్ష్మీపతిరావు చెప్పారు. జిల్లాలో రూ.10.44 కోట్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక చేపట్టారు.