తూర్పుగోదావరి

చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం నా అదృష్టం:వివి వినాయక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, ఏప్రిల్ 28: చాలాకాలం విరామం తరువాత సినీ రంగంలో పునఃప్రవేశం చేస్తున్న అగ్ర కథానాయకుడు చిరంజీవి 150వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ అన్నారు. ప్రతీ సినిమాకు ప్రారంభం ముందుగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించి తన స్క్రిప్ట్‌కు స్వామివారి సన్నిధిలో పూజలు జరిపించుకుంటానన్నారు. తిరిగి హైదరాబాద్ వెళ్తున్న వినాయక్ గురువారం మలికిపురంలో విలేఖరులతో మాట్లాడారు. రామ్‌చరణ్ సొంత బ్యానర్‌లో నిర్మించే ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడి ఉంటుందన్నారు. చిరంజీవి నటించే ఈ 150వ సినిమా ఠాగూర్ సినిమా స్థాయిలో విజయవంతమయ్యేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశామన్నారు. ఏప్రిల్ 29వ తేదీన హైదరాబాద్‌లో పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మే 8వ తేదీ నుండి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమవుతుందన్నారు. హీరోయిన్, సాంకేతిక బృందం ఎంపికను త్వరలో పూర్తిచేస్తామన్నారు. ఆయన వెంట ప్రవీణ్ తదితరులున్నారు.