తూర్పుగోదావరి

విద్య సాధికారిత సాధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 24: విద్య అనేది సాధికారిత సాధనం అని ఓ ఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ అన్నారు. ఓఎన్జీసీ రాజమహేద్రవరం అసెట్ అఖిల భారత ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఏవీ రోడ్డులోని సూర్యా గార్డెన్స్‌లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానంపై ప్రస్తుతం సామాజిక, ఆర్ధిక ధృక్పథం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాజమహేంద్రవరం ఓఎన్జీసీ అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ ఓఎన్జీసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో త్వరలో మొత్తం 500 కేంద్రాల స్థాయిలో విద్యా సేవలు అందిస్తామన్నారు. ఓఎన్జీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా పలువురు మేధావులు పాల్గొని అంబేద్కర్ ఆలోచనా విధానంపై ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులపై లోతైన చర్చ గావించారు. పూనా ఒప్పందం, చారిత్రాత్మక చర్చల రిజర్వేషన్ల వంటి చారిత్రాత్మక సంఘటనలను మేధావులు చర్చించారు.
సీనియర్ జర్నలిస్టు సతీష్ చంద్ర, మాజీ ఐఎఎస్ ఆఫీసర్ జేబీ రాజు, సౌత్ సెంట్రల్ రైల్వే మాజీ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎ భరత్ భూషణ్, ఏపీ ఈపీ డిఎసిఎల్ ఈడీ బి రమేష్ ప్రసాద్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం రాజ్‌కిషోర్, ఇన్‌కం టాక్సు అడిషనల్ కమిషనర్ వి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
కులతత్వం, గౌరవ హత్యలు, కుల వివక్షత, అణచివేత, సామాజిక, ఆర్ధిక అభివృద్ధి తదితర అంశాలపై వక్తలు ప్రసంగించారు. 1932 సెప్టెంబర్ 24వ తేదీన జరిగిన పూనా ఒప్పందాన్ని మననం చేసుకుంటూ చర్చ జరిపారు. అప్పట్లోనే అల్ప సంఖ్యాకులుగా ఉన్నవారికి నియోజకవర్గాలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ రిజర్వేషన్లను కాపాడుకోవాలని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని విధాలా అభివృద్ధి సాధించాలన్నారు. ఇంకా వెనుకబాటు తనం కొనసాగుతోందని ఆందోళన వ్యక్తమైంది. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అందిపుచ్చుకుని సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం అంబేద్కర్‌పై నాటకాన్ని ప్రదర్శించారు. అంతకు ముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని ఓ ఎన్జీసీ కేజీ బేసిన్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఒ ఎన్జీసీ ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లారుూస్ సంక్షేమ సంఘం నాయకులు విజయపాల్, ఎ సత్యనారాయణ, బి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.