తూర్పుగోదావరి

మన్యంలో కొనసాగుతున్న తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, సెప్టెంబర్ 24: విశాఖ జిల్లాలో మవోయిస్టులు ఎమ్మెల్యే కిడారి మాజీ ఎమ్మెల్యే సోమును కాల్చి చంపడంతో సోమవారం పోలీసులు ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు. జడ్డంగి పోలీస్టేషన్‌లో ఎస్సై టి గోపీ నరేంద్రప్రసాద్ ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులపై మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశముందని, తమకు చెప్పకుండా, ముందస్తు అనుమతిలేకుండా లోతట్టు గ్రామాలకు వెళ్లవద్దని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సమావేశాలు ఏర్పాటు చేసి నోటీసులు జారీ చేస్తున్నామని, మండలంలో అందరూ ఎంపీటీసీలకు, జడ్పీటీసీకి నోటీసులు అందజేశామని స్థానిక ఎస్సై రవికుమార్ వెల్లడించారు. తమకు తెలియజేయకుండా బహిరంగ సభలకు వెళ్లవద్దని, పార్టీ కార్యక్రమాలు కూడ ఇప్పట్లో నిర్వహించవద్దని పోలీసులు నాయకులకు సూచించారు. ఇదిలా ఉండగా మారుమూల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ఆచూకీకోసం సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నాయి. విశాఖ జిల్లా సంఘటన అనంతరం మావోయిస్టులు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించే అవకాశమున్నందున సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. కొయ్యూరు మండలానికి ఆనుకుని ఉన్న రాజవొమ్మంగి మారుమూల అటవీ ప్రాంతాలపై పోలీసులు ఎక్కువగా దృష్టి సారించారు. రాజవొమ్మంగి, జడ్డంగిలలో వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. విశాఖ జిల్లాకు వెళుతున్న, విశాఖ జిల్లా నుండి వస్తున్న వాహనాలపై ఎక్కువ దృష్టిసారించి ప్రయాణీకులు లగేజీలను సైతం తనిఖీ చేసి విడిచిపెట్టారు. ఇరువురు అధికార పార్టీ నాయకులను పట్టపగలే మావోయిస్టులు కాల్చి చంపడంతో ప్రజాప్రతినిధుల గుండెల్లో గుబులు మొదలైంది. తాము ఎటువంటి అన్యాయాలు, అక్రమాలు చేయకపోయినా కేవలం అధికారపార్టీ నేతలు అనే నెపంతో తమపై మావోయిస్టులు దాడి చేయవచ్చని ప్రజాప్రతినిధులు తీవ్రంగా భయపడుతున్నారు. నేతలు కాల్చివేతకు నిరసనగా విశాఖ మన్యం బంద్‌కు పిలుపునివ్వడంతో ఏలేశ్వరం నుండి నర్సీపట్నం వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు క్రమబద్ధీకరించారు. కొన్ని సర్వీసులను మాత్రమే నడిపారు. గిరిజన గ్రామాల్లో నైట్ హాల్ట్ బస్సులను సోమవారం రాత్రి కూడా నిలిపివేసారు. మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడే అవకాశమున్నందున ముందస్తుగా మన్యంలో సాయుధ బలగాలు గస్తీ తిరుగుతున్నాయి. అనుమానం ఉన్న చోట్ల కల్వర్టులను తనిఖీ చేస్తున్నారు. మావోయిస్టులు మందుపాతరలు అమర్చ వచ్చనే అనుమానంతో వంతెనలు తనిఖీ చేస్తున్నారు.
వై రామవరం: వారపుసంత సందర్భంగా సోమవారం వై రామవరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా అటవీ ప్రాంతంలో ఆదివారం మద్యాహ్నం ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమాను మావోయిస్టులు హతమార్చిన విషయం విదితమే. దీంతో ఏజన్సీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘటన అనంతరం మావోయిస్టులు ఇటువైపు రావచ్చుననే అనుమానంతో భారీఎత్తున కూంబింగ్ ప్రారంభించారు. దీంట్లో భాగంగానే సోమవారం వై రామవరం వారపుసంతకు వచ్చి పోయే వాహనాల్లో రవాణా చేసే సామాగ్రిని పరిశీలించి రికార్డులు సక్రమంగా లేని వాహనాలపై కేసులు నమోదు చేసారు. అనుమానస్పద ప్రదేశాల్లో పోలీసు జాగిలం సహాయంతో తనిఖీలు జరిపారు. స్థానిక ప్రజాప్రతినిధులను, నాయకులను లోతట్టు అటవీ ప్రాంతంలోకి వెళ్ళవద్దని స్థానిక ఎస్సై సతీష్‌బాబు అప్రమత్తం చేశారు. స్టేషన్ సిబ్బంది, సిఆర్పీఎఫ్ 42 బెటాలియన్ పోలీసులు పాల్గొన్నారు.

అక్టోబర్‌లో మెగా లోన్‌మేళా: కలెక్టర్
కాకినాడ సిటీ, సెప్టెంబర్ 24: సిఎం జిల్లా పర్యటనకు రానున్న నేపధ్యంలో అక్టోబర్ మూడవ వారంలో కాకినాడలో మెగా లోన్‌మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలియజేశారు. దీని కోసం వివిధ కార్పొరేషన్‌ల ద్వారా 50వేల యూనిట్ల గ్రౌండింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టుహాలు నుండి సోమవారం ఆయద జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ ప్రాధాన్యతాంశాలతో వారాంతపు ప్రగతని సమీక్షించారు. ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు అక్టోబర్ 22, 23 తేదీలలో జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. ఈసందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు, మైనారిటీ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 50వేల లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీతో మెగా రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించే స్వచ్చతయే సేవా కార్యక్రమంలో అధికారులు అందరూ పాల్గొనాలని, అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని స్పష్టంచేశారు. ఈసమావేశానికి ముందు నిర్వహించిన వివిధ ప్రాజెక్ట్‌ల సమీక్షలో ఎడిబి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని, ఎన్‌హెచ్ ఫ్లైఒవర్లు, ఏటిమొగ హైలెవెల్ బ్రిడ్జి, కోటిపల్లి లైను, భారత్‌మాల బీచ్‌రోడ్ పనులకు సర్వే, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో జేసి-2 సిహెచ్ సత్తిబాబు, ఇఎఫ్‌ఒ నందని సలారియా, డిఆర్‌ఒ ఎస్‌విఎస్ సుబ్బలక్ష్మి, ఎల్‌డిఎం బివి సుబ్రమణ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిజనల్, మండల అధికారులు పాల్గొన్నారు.